ప్రస్తుతం భారత దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మన దేశం లో అడుగు పెట్టి రెండు రోజులే అయినా రాజకీయ నాయకులపై కూడా తన ప్రభావాన్ని చూపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందుగా తెలంగాణ లో బయటపడిన ఈ కరుణా వైరస్ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ కు పాకిన విషయం తెలిసిందే. ఇకపోతే ప్రతి దేశంలో లాగానే కరోనా వైరస్ కి గురైన వ్యక్తుల లాగానే ఆ దేశంలోని రాజకీయ నాయకులు కూడా దాని వల్ల వచ్చే తీవ్రమైన ఒత్తిడితో తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు.

 

ఇప్పటికే ఆంధ్రాలో కరోనా తన ప్రభావం చూపించకు మునుపే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులకు అన్ని నివారణ చర్యలు తీసుకోవాలని వెంటనే ఆదేశించారు. తెలంగాణలో కరోనా బయట పడిన వెంటనే అతను అత్యవసర మీటింగ్ లను ఏర్పాటు చేసి ఎమర్జెన్సీ సేవల కోసం అతి వేగంగా స్పందించే కొన్ని రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేయమని రాష్ట్ర వైద్య బృందాలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే జగన్ ఈ ఆదేశాలు జారీ చేసేవరకు ఆంధ్రలో కరోనా ఎవరికీ సోకినట్లు ఎలాంటి రిపోర్ట్లు రాలేదు.

 

మరీ ముఖ్యంగా జగన్ సంబంధిత అధికారులకు ప్రతీ ఒక్క జిల్లాలో ఇతర దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులను జల్లెడపట్టి వారికి పరీక్షలు చేయవలసిందిగా కోరాడు. జిల్లా ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయమని మరియు డాక్టర్లను అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పి ఒక మంచి యాక్షన్ ప్లాన్ ద్వారా కొంత మంది నిపుణులను కూడా నియమించారు. 

 

అయితే ఇన్ని ముందస్తు చర్యలు తీసుకున్నా ఏలూరులో ఇద్దరు వ్యక్తులకి కరోనా వైరస్ సోకిందని తెలియడంతో నివ్వెరపోవడం ప్రజల వంతు అయింది. జగన్ తాను చేయగలిగింది దానికన్నా ఎక్కువే చేసినా ఇలా ఆంధ్రప్రదేశ్ లో లో ఈ మహమ్మారి సోకడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే ఇప్పుడు జరగబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని విపక్షాలు కరోనా వైరస్ ఆంధ్ర రాష్ట్రంలో బయటపడినందుకు జగన్ అసమర్థతే కారణం అని విపక్షాలు దుమ్మెత్తి పోసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ నిజంగా అందరి రాజకీయవేత్తల కన్నా అప్రమత్తంగా ఉన్నా ఇలా జరగడం ఘోరం అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: