పాపం.. ఇంటర్ విద్యార్థులు.. నిన్న తెలంగాణాలో నిమిషం లేటు కారణంగా ఎంతమంది విద్యార్థుల సంవత్సరం చదువు వెస్ట్ అయ్యిందో తెలుసా? పాపం.. ఆ విద్యార్థులు.. నిమిషం లేటు కారణంగా విధ్యార్ధులను పరీక్షా రాయకుండా ఆపేశారు.. అక్కడికి ఏదో ఈ వ్యవస్థలో అన్ని సక్రమంగా సమయానికి జరుగుతున్నట్టు.. 

 

ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని నాయకులూ ఉన్న ఈ వ్యవస్థలో నిమిషం లేటు కారణంగా పరీక్షా రాయనివ్వలేదు అంటే అధికారులు ఎంత కరెక్ట్ ఓ అర్థం చేసుకోవాలి.. కనీసం కనికరం లేకుండా ఉన్నారు విద్యార్థులు. అయినా అదే స్థానంలో వారి పిల్లలు ఉంటే కూడా ఇలాగే ప్రవర్తిస్తారా? అంతలేదు.. వాళ్ళు పెద్ద పిల్లలు కాబట్టి అలా ప్రవర్తిస్తారు. 

 

ఈ నిమిషం లేటు నిబంధనను తొలిగించాలి అని ప్రతి సంవత్సరం మీడియా గొంతు ఎత్తి అడగటమే కానీ అది అలాగే కొనసాగుతుంది. సరే.. ఇది అంత పక్కన పెడుదాం.. తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ఓ విద్యార్థి హైటెన్షన్ ఏ దెబ్బ తీసింది. టెన్షన్ లో పరీక్ష కేంద్రం అడ్రసును గుర్తించటంలో పొరపాటు పడి ఆ విద్యార్థిని చివరకు పరీక్ష రాయలేక వెనుదిరిగింది. 

 

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవిమల్లేలలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న వి.అనూష అనే బాలిక గత కొద్ది రోజుల నుంచి విద్యార్థిని అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో కాలేజీకి అప్పుడప్పుడు మాత్రం వెళ్లి వచ్చేది. పరీక్షల సమయం కావటంతో తన హాల్‌టికెట్‌ను ఇంటర్నెట్ లో డౌన్‌లోడు చేసుకుంది. 

 

హాల్‌టికెట్‌లో పరీక్ష కేంద్రం పేరు తెలంగాణ మోడల్‌ జూనియర్‌ కళాశాల, టేకులపల్లి, పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా అని స్పష్టంగా ఉంది. ఈ అడ్రసును సరిగా గుర్తించలేక పోయిన అనూష ఖమ్మం నగరంలోని టేకులపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం పరీక్ష కేంద్రం అనుకుని పొరపాటున అక్కడికి పరీక్ష రాసేందుకు వెళ్లింది. 

 

అక్కడి అధికారులు ఇది అడ్రెస్ కాదు అని ఖమ్మంలోని నయాబజారులో ఉన్న జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ అధికారిని సంప్రదించాలని వారు సూచించారు. అయితే ఆమె అక్కడికి వెళ్లగా అక్కడి సిబ్బంది డీఐఈవో ఆఫీసు అడ్రసును ఇచ్చారు. అప్పటికే సమయం 8.55 అవ్వడంతో ఆమె వెళ్లి డీఐఈవో రవిబాబును కలిసి తన పొరపాటును చెప్పుకోగా అక్కడ పరీక్ష రాయించటం కుదరదని వారు చెప్పారు. దీంతో ఆ విద్యార్థి కన్నీరు పెట్టుకొని వెనుదిరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: