ప్రపంచ వ్యాప్తంగా మానవ జాతిని హడలెత్తిస్తున్న భయంకరమైన కరోనా వైరస్ భారతదేశంలో అడుగు మోపిన విషయం తెలిసిందే. అయితే మిగతా రాష్ట్రాల కన్నా ఎక్కువగా రెండు తెలుగు రాష్ట్రాలనే ఇప్పుడు వైరస్ భయపెడుతోంది. మొట్టమొదట హైదరాబాద్ కు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి లో బయటపడ్డ కరోనా వైరస్ ఇప్పుడు ఆర్టీసీ వారి నిర్లక్ష్యం వల్ల ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా వణికించే స్థితికి చేరుకుంది.

 

 

మామూలుగా సుదూర ప్రయాణం చేసే బస్సులలో రిజర్వేషన్ టికెట్లు మాత్రమే ఉంటాయి. కొన్నింటికి అయితే సీట్లు మిగిలినా రిజర్వేషన్ లేనిదే టికెట్ కూడా ఇవ్వకూడదు అనే నిబంధనలు ఉన్నాయి. అయితే హైదరాబాదులో కరోనా బారిన పడిన వ్యక్తి బెంగళూరు నుండి హైదరాబాద్ కు గత నెల 22 తేదీన ఒక ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశాడు. బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్లే బస్సు కేవలం రెండు మూడు చోట్ల మాత్రమే ఆగుతుంది. ఇకపోతే బస్సులో 27 మంది ప్రయాణించగా అందులో 17 మంది ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వారే కావడం గమనార్హం.

 

 

అయితే ప్రస్తుతం కరోనా వ్యాధి కలిగినటువంటి వ్యక్తి బస్సులోనే ప్రయాణించడం వల్ల 27 మందికి టెస్టులు జరిపించవలసిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన 17 మందిలో దాదాపుగా అంతా అనంతపురం జిల్లాకి చెందిన వారు అని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే వారిలో చాలామందికి వివరాలు ఏవీ సరిగ్గా తెలియదు.

 

ఇకపోతే వ్యాధికి గురి అయిన వ్యక్తి వచ్చిన బస్సు లో రిజర్వేషన్ లేకుండా టికెట్లు తీసుకోవడానికి కూడా పర్మిషన్ ఉన్నా ఒకపక్క కరోనా సోకిన వ్యక్తి లక్షణాలు చూపిస్తూ ఉంటే కొంచమైనా అవగాహన పూరితంగా ఆలోచించి ఇతరులను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ఆర్టీసీ ఉద్యోగుల పై ఎంతైనా ఉంది. ఇటువంటి వ్యాధులు పబ్లిక్ వాహనాల్లో సులువుగా సోకేందుకు అవకాశం ఉన్నందున కనీసం ఆర్టీసీ వారైనా సూపర్ లగ్జరీ బస్సులలో రిజర్వేషన్ కచ్చితంగా ఉండాలన్న విధంగా కొన్ని రోజులు నిబంధన తేవాల్సింది. ఏదైనా వారి ముందు చూపు లోపం వల్లనే ఇప్పుడు అంతా ప్రమాదంలో పడ్డారు అని సోషల్ మీడియాలో ప్రజలంతా విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: