పేరుకే మంత్రి పదవి,పెత్తనమంతా అధినాయకుడుదే కావడంతో తెలంగాణ మంత్రులు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. పేరుకే తాము మంత్రులుగా టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నా.. స్వతంత్రంగా ఏ ఒక్క నిర్ణయం తీసుకునే పరిస్థితి తమకు లేకపోవడంతో వీరు తీవ్ర అసంతృప్తిగానే తమ పదవులను అనుభవిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తరహా పెత్తనం ఎక్కువైందని వీరంతా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. టిఆర్ఎస్ తెలంగాణలో మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులుగా బాధ్యతలు తీసుకున్న వారంతా తమ హవాను చూపించారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ, పెత్తనం చేస్తూ ప్రజలలో పలుకుబడి పెంచుకున్నారు. 

IHG


తమ శాఖలపై పూర్తిగా పట్టు సాధించి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ, తమకు కావాల్సిన వారికి ఏ పదవి, పనులు కావాలన్న ఇచ్చుకుంటూ మంత్రి పదవిని అన్ని రకాలుగా వినియోగించుకున్నారు. ఆ విధంగానే అన్ని రకాలుగా మంత్రులకు స్వతంత్రం కల్పిస్తూ వచ్చారు. కానీ ఆ పరిస్థితి రెండోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రులకు లేకుండా పోయింది. తన ఒక్కడి కష్టం వల్లే రెండోసారి అధికారంలోకి వచ్చామని కెసిఆర్ బహిరంగంగానే చెప్పుకుంటూ.. పూర్తిగా తన మాట జవదాటని వ్యక్తులను మంత్రులుగా కెసిఆర్ నియమించుకున్నారు. 

IHG


కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కూడా అన్ని మంత్రిత్వశాఖల్లోనూ వేలు పెడుతూ, పెత్తనం చేస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండగా అంతగా ఈ దూకుడు చూపించకపోయినా ..కొంతకాలం క్రితం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొత్తం అన్ని శాఖలను తన అదుపులో పెట్టుకున్నారు. ఇక అప్పటి నుంచి తమకు ఏ పని కావాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కేటీఆర్, కేసీఆర్ చెప్పిందానికి ఊ కొట్టడం తప్ప మరి ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోవడంతో మంత్రులు బాధ వర్ణనాతీతం. చెప్పుకోవడానికి తప్ప తమ చేతుల్లో అధికారం లేదని, అసలు ఎందుకు మంత్రులుగా ఉన్నామో  తమకే తెలియదు అంటూ తమ బాధను వ్యక్తం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

  

మరింత సమాచారం తెలుసుకోండి: