ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గాలి తీసేశారు ముగ్గురు మంత్రులు. రాజధాని రైతుల సమస్యలపై వెంకయ్య ఢిల్లీలో  సమీక్ష నిర్వహించారంటూ పచ్చమీడియాలో కథనాలు వచ్చాయి. నిజానికి ఉపరాష్ట్రపతి ఏ శాఖ అధికారులతోను సమీక్షలు నిర్వహించేందుకు లేదు. కాకపోతే ఎవరైనా బాధితులు వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటే వినటం సదరు విజ్ఞాపనలను సంబంధిత మంత్రిత్వ శాఖలకు పంపటం వరకే చేస్తారు. మహా అయితే విషయం తీవ్రతను బట్టి ముఖ్యమంత్రితోను లేకపోతే మంత్రులతోనో మాట్లాడుతారంతే.

 

కానీ పచ్చమీడియిలో మాత్రం రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్ష నిర్వహించినట్లుగా  కథనాలు ఆశ్చర్యం కలిగించాయి. ఇదే విషయమై ముగ్గురు మంత్రులు కురసాల కన్నబాబు, కొడాలి నాని, అనీల్ కుమార్ యాదవ్ ఉపరాష్ట్రపతికి లేఖ రాశారు. కాకపోతే వెంకయ్య చేసినట్లుగా వచ్చిన సమీక్షను మాత్రం తమ లేఖలో మంత్రులు ఎక్కడా ప్రస్తావించలేదు. అందుకనే రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను మాత్రమే ప్రస్తావించారు.

 

ధాన్యం విషయంలో కేంద్రం రాష్ట్రంలోని రైతులకు ఇవ్వాల్సిన రూ. 4724 కోట్ల బకాయిలను వెంటనే ఇప్పించాలంటూ కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన వేల కోట్ల రూపాయల రీ ఎంబర్స్ మెంట్ వెంటనే వచ్చేట్లు చేయాలని చెప్పారు. తమ లేఖలో మంత్రులు ప్రస్తావించిన అంశాలన్నీ రైతులకు, వ్యవసాయ శాఖకు సంబంధించింది మాత్రమే.

 

రైతులను చంద్రబాబు ఎలా మోసం చేసింది, కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు తదితరాలను ప్రస్తావిస్తు రాష్ట్రానికి మేలు చేయాలంటూ విజ్ఞప్తి చేయటమంటే వెంకయ్యకు ఎక్కడో కాలటం తప్ప మరోటి కాదనే చెప్పాలి.

 

తాజాగా మంత్రుల లేఖతో వెంకయ్యకు ఓ ఇబ్బంది వచ్చిపడిందనే చెప్పాలి. అదేమిటంటే రైతు సమస్యలపై సమీక్ష నిర్వహించిన తర్వాత తాము ప్రస్తావించిన అంశాలను కూడా కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖలతో ఎందుకు మాట్లాడటం లేదని రేపు మంత్రులు నిలదీస్తారు. ఒకవేళ రైతులతో తాను సమీక్ష చేశానంటూ వచ్చింది తప్పుడు వార్తయితే ఆ విషయాన్ని ఎందుకు ఖండించటం లేదని అడుగుతారు. అంటే అప్పుడు పచ్చమీడియానే తప్పుడు వార్తలిచ్చినట్లు స్పష్టమవుతుంది. మొత్తం మీద మంత్రులు కావాలనే వెంకయ్యకు లేఖ రాసినట్లు అనుమానంగా ఉంది.     

మరింత సమాచారం తెలుసుకోండి: