రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితినే.. క‌లెక్ష‌న్ కింగ్, మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు మోహ‌న్‌బాబు ఎదుర్కొంటున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. విష‌యంలో కి వెళ్తే.. సినిమాల్లో బాగా పాపుల‌ర్ అయిన మోహ‌న్ బాబు రాజ‌కీయంగా కూడా త‌న‌దైన శైలిలో రాణించారు. అయితే, ఆయ‌న వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌లు అనండి.. రాజ‌కీయంగా ఆయ‌న వేసిన అడుగులు అనండి ఇప్పు డు మా త్రం ఆయ‌న సంధి కాలంలో ప‌డ్డారు. మ‌రోసారి రాజ్య‌స‌భ కోసం వెళ్లాల‌నే ఆయ‌న ప్ర‌య త్నం బెడిసి కొడుతోంద‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. గ‌తంలోటీడీపీ త‌ర‌పున ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్య త్వం సొంతం చేసుకున్నారు.

అయితే, మ‌రోసారి రెన్యువ‌ల్ చేయించుకోవాల‌ని అనుకున్నా.. అప్ప‌టి స‌మీక‌ర‌ణ‌లు స‌హ‌క‌రించ‌క‌పోవ డంతో చంద్ర‌బాబు ఆయ‌న‌కు పున‌రుద్ధ‌రించ‌లేక పోయారు. దీంతో ఏకంగా చాన్నాళ్లు పార్టీకి దూరంగా ఉన్నారు. దాదాపు రాజ‌కీయాల‌కు గుడ్ బైచెప్పార‌నే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఆ త‌ర్వాత ఆయ‌న గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందుజ‌గ‌న్‌కు జై కొట్టారు. అదేస‌మ‌యంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో ఉద్య మించారు. త‌న కాలేజీ విద్యార్థుల‌కు చంద్ర‌బాబు ఫీజు రియింబ‌ర్స్‌మెంట్ చేయ‌డం లేద‌ని తిరుప‌తిలో పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు చేసి సంచ‌ల‌నానికి వేదిక‌గా మారారు.

ఈ క్ర‌మంలోనే గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ తీర్తం పుచ్చుకుని ఆ పార్టీ త‌ర‌ఫున ఎన్నిక‌ల్లో ప్ర‌చా రం కూడాచేశారు. జ‌గ‌న్‌ను గెలిపించేందుకు, సీఎంను చేసేందుకు తాను మ‌రోసారి జెండా ప‌ట్టుకున్నాన ని అప్ప‌ట్లో చెప్పారు. జ‌గ‌న్ గెలిచిన త‌ర్వాత మ‌రోసారి ఆయ‌న దూరంగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ న జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చినా త‌న కాలేజీ విద్యార్థుల‌కు రీయింబ‌ర్స్‌మెంట్ జ‌ర‌గ‌లేద‌ని మ‌న‌సులో వేద‌న పెట్టుకున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. ఏదైతేనేం ఆయ‌న సైలెంట్ అయిపోయారు. సీఎం పీఠం ఎక్కిన జ‌గ‌న్‌ను సైతం ఆయ‌న అభినందించ‌లేదు. దీంతో వారిద్ద‌రి మ‌ధ్య గ్యాప్ పెరిగింది.

ఇంత‌లోనే ఆయ‌న బీజేపీ నేత‌ల‌ను క‌లిసారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, అమిత్ షాల‌తో కుటుంబంతో స‌హా వెళ్లి క‌లిశారు. ఈ ప‌రిణామాలు మ‌రింత‌గా జ‌గ‌న్‌-మోహ‌న్‌బాబుల మ‌ధ్య గ్యాప్ పెంచింద‌నే విశ్లేష‌ణ‌లు ఉన్నాయి. ఇదిలావుంటే, ఇప్పుడు రాజ్య‌స‌భ సీటు జ‌గ‌న్ ఇస్తారా? ఇవ్వ‌రా? అనే ప్ర‌శ్న తెర‌మ‌దికి వ‌చ్చింది. మొత్తం 4 సీట్లు వైసీపీకి ద‌క్క‌నున్నాయి. ఈ నాలుగింటిలో మూడు ఇప్ప‌టికేఖ‌రార‌య్యాయి. ఒక‌టి అంబానీ మిత్రుడు ప‌రిమ‌ల్‌కు ఇవ్వ‌నున్నారు. రెండోది మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌కు ఖ‌రారు చేశారు. మూడోది.. ఎస్సీ కోటాలో అమ‌లాపురం మాజీ ఎంపీ పండుల ర‌వీంద్ర‌కు ఇస్తార‌నే ప్ర‌చారం సాగుతోంది.

ఇక మిగిలింది  ఒకే ఒక్క‌టి... అయితే, త‌ర‌చుగా నోరు విప్పితే మ‌హిళా రిజ‌ర్వేష‌న్ జ‌పం చేసే జ‌గ‌న్ దీనిని మ‌హిళ‌ల‌కు కేటాయిస్తార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో క‌ర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక‌, శ్రీకాకుళం మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణిలు ఉన్నారు. దీంతో ఈ ఇద్ద‌రిలో ఒక‌రికి జ‌గ‌న్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఈ ప‌రిణామాల‌తో మోహన్‌బాబుకు సీటు ద‌క్కే ఛాన్స్‌లేద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: