అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ...వీలు దొరికినప్పుడల్లా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. పలు నిర్ణయాలపై పోరాటాలు, ఆందోళనలు చేస్తున్నారు. అయితే ఈ విధంగా ప్రభుత్వంపై పోరాడుతున్న చంద్రబాబుకు తమ పార్టీ నేతల నుంచి ఏ మేర సపోర్ట్ లభిస్తుందనే ప్రశ్న ఎదురైతే...పెద్దగా సపోర్ట్ దొరకట్లేదనే చెప్పుకోవచ్చు.

 

ఎన్నికల్లో ఓడిపోయాక చాలామంది నాయకులు సైలెంట్ అయిపోయారు. ఇటు గెలిచిన ఎమ్మెల్యేల్లో కొందరు ఇంకా యాక్టివ్ కాలేదు. కాకపోతే ఈ మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చిన దగ్గర నుంచి కొందరు నేతలు యాక్టివ్ అయ్యారు. మొదట్లో కంటే ఇప్పుడు ఎక్కువ మంది టీడీపీ నాయకులు బాబుకు అండగా నిలుస్తూ, జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. సమాయనుకూలంగా ప్రెస్ మీట్లు పెట్టి జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు చేస్తున్నారు.

 

అయితే ఇంతమంది టీడీపీలో మాట్లాడుతున్న, వారెవరూ వైసీపీ ప్రభుత్వాన్ని పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోతున్నారని అర్ధమవుతుంది. ఎవరికివారే నోటికి పనిచెబుతున్నారు తప్ప, పెద్దగా సబ్జెక్ట్ పరంగా మాట్లాడుతున్నట్లు కనిపించడం లేదు. కాబట్టి ఏ విషయన్నైనా సబ్జెక్ట్ పరంగా మాట్లాడుతూ.. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కూలంకషంగా మాట్లాడే టీడీపీ సీనియర్ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పార్టీలో యాక్టివ్ కావల్సిన అవసరముందని తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారు.

 

2004,09లలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పయ్యావుల హుందాగా వ్యవహరిస్తూ, సబ్జెక్ట్ వైజ్ మాట్లాడుతూ అప్పటి వైఎస్సార్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారని, ఇప్పుడు అదే రేంజ్‌లో పలు సమస్యలపై జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలంటే పయ్యావుల రంగంలోకి దిగాల్సిందేనని అంటున్నారు. ఇంకా పి‌ఏ‌సి ఛైర్మన్‌గా ఉండటం పయ్యావులకు అడ్వాంటేజ్ అని చెబుతున్నారు.

 

అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇన్‌సైడ్ ట్రేడింగ్‌పై ఆర్ధిక మంత్రి బుగ్గనకు పయ్యావుల గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. కానీ అసెంబ్లీ సమావేశాలు తర్వాత పయ్యావుల మళ్ళీ బయట కనిపించలేదు. ఇప్పటికైనా పయ్యావుల బయటకొచ్చి, బాబుకు సపోర్ట్‌గా ఉంటే వైసీపీ ప్రభుత్వానికి ఇంకాస్త హెడేక్ పెరిగే అవకాశముందని తమ్ముళ్ళు అనుకుంటున్నారు. మరి చూడాలి సబ్జెక్ట్ పరంగా మాట్లాడటంలో దిట్ట అయిన పయ్యావుల పార్టీలో ఎప్పటికి యాక్టివ్ అవుతారో?

మరింత సమాచారం తెలుసుకోండి: