ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కరోనా వైరస్ గురించిన చర్చలు మాత్రమే నడుస్తున్నాయి.  మొన్నటి వరకు కరోనా చైనా ఇతర దేశాల్లో మాత్రమే అనుకుంటే.. ఇప్పుడు భారత్ పై కూడా ఈ ప్రభావం చూపుతుంది.  మరణాలు సంబవించలేదు కాదు.. ఈ రోగాన భారిన పడుతున్న కేసులు నమోదు అవుతున్నాయి.  కరోనా భయంతో ఇళ్లు, ఆఫీసులు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, పాఠశాలలు అన్ని చోట్లా కరోనా కు సంబంధించిన విషయంపైనే చర్చలు నడుస్తున్నాయి. అలాగే కరోనా భారిన పడకుండా జాగ్రత్తలు సూచిస్తున్నారు.   ప్రస్తుతం ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి.  మరోవైపు కరోనా గురించిన వార్తలు సంచలనాలు రేపుతున్నాయి.

 

తాజాగా కరోనా ఎఫెక్ట్ కారణంగా  తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.  పరీక్షల నిర్వహణా నిబంధనల్లో మార్పులు చేసింది. విద్యార్థులు మాస్కులను ధరించి పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. వారి స్వంత వాటర్ బాటిల్ ని పరీక్ష హాల్ లోకి తీసుకు రావొచ్చని.. అంతే కాదు జలుబు, తుమ్ములు, దగ్గు ఇలాంటివి ఎవరికైనా వస్తుంటే వారికి సపరేట్ గదిని కేటాయించే వీలును చేయనున్నట్లు దీనిపై అక్కడి ఇన్ చార్జ్, ఇన్విజిలేటర్లు సొంతంగా నిర్ణయం తీసుకుంటారని ఉన్నత విద్యామండలి అధికారి ఒకరు తెలియజేశారు. గత ఏడాది ఇంటర్ బోర్డు చేసిన తప్పిదాల వల్ల పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. 

 

ఈ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు.  అయితే దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్ గానే వ్యవహరించింది.  ఈసారి ఇంటర్ ఫలితాల విషయంలో తగు జాగ్రత్తలు ఉండేలా చూస్తామని విద్యార్థులు తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.  ప్రస్తుతం తెలంగాణ లో కరోనా కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో కరోనా అనుమానితుల సంఖ్య 550కి చేరువైంది. నిన్న ఒక్కరోజులో 90 మంది బాధితులు గాంధీ ఆసుపత్రిని ఆశ్రయించగా, వారిని అబ్జర్వేషన్ లో ఉంచారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: