జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నీళ్ళు చల్లినట్లైంది. ఈనెల 15వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బి స్టేడియంలో జరగాల్సిన బహిరంగ సభ రద్దవటంతో పవన్ తీవ్ర నిరాసలో కూరుకుపోయాడట. సిఏఏ వివాదంపై జనాలకు వివరణ ఇచ్చుకునేందుకు అమిత్ షా  హైదరాబాద్ వద్దామని అనుకున్నాడు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ తో కలిసి బహిరంగసభ కేంద్రహోం మంత్రి మాట్లాడాల్సుంది.

 

అయితే అనూహ్య సంఘటనల కారణంగా సభను వాయిదా వేసుకుంటున్నట్లు బిజెపి ప్రకటించటంతో పవన్ కు షాక్ కొట్టినట్లైంది. ఎందుకంటే అమిత్ షా తో అపాయిట్మెంట్ కోసం పవన్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. కానీ ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా సాధ్యం కాలేదు. అలాంటిది స్వయంగా అమిత్ షా పాల్గొనే సభలో పాల్గొనాలంటూ పవన్ కు  ఆహ్వానం అందటంతో చాలా హ్యాపీగా ఫీలయ్యాడు.

 

అయితే హఠాత్తుగా సిఏఏపై దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్లు, ఇతర ప్రాంతాల్లో కూడా తీవ్ర అసంతృప్తితో పాటు తాజాగా కరోనా వైరస్ సమస్య పెరిగిపోతుండటంతో ముందు జాగ్రత్తగా ఎల్బి స్టేడియంలో సభ రద్దయిందని సమాచారం. నిజానికి ఢిల్లీ జరిగిన అల్లర్లు, మరణాలకు బిజెపి నేతల బాధ్యత లేని ప్రకటనలే కారణమనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఏకంగా 45 మంది మరణించటం సంచలనంగా మారింది.

 

ఎప్పుడైతే ఢిల్లీలో పరిస్ధితులు విషమించటం చూసిన తర్వాత సిఏఏ ఎంతటి సున్నితమైన విషయం అర్ధమైపోయింది. దానికి తోడు హైదరాబాద్ లో ముస్లింల ప్రాబల్యం కూడా చాలా ఎక్కువన్న విషయం తెలియంది కాదు. దాంతో ముందు జాగ్రత్తగానే బహిరంగసభను పార్టీ రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఏదేమైనా బహిరంగసభ అర్ధాంతరంగా రద్దవటం పవన్ కు మాత్రం తీరని నిరాసనే మిగిల్చిందని తెలిసిపోతోంది. మళ్ళీ అమిత్ షా ను కలుసుకునే అవకాశం కోసం పవన్ ఎంత కాలం వెయిట్ చేయాలో ఏమో ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: