ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాలలో కరోనా కలకలం రేపుతోంది. ఏపీలోని కృష్ణా, గుంటూరు, విశాఖ ప్రజలు విదేశాల నుంచి వస్తున్న వ్యక్తుల ద్వారా కరోనా వ్యాపిస్తూ ఉండటంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆహారపు అలవాట్లను మార్చుకుంటే కరోనా రాకుండా జాగ్రత్త పడవచ్చని చెబుతున్నారు. 
 
శరీరంలో రోగ నిరోధక శక్తి ఉంటే కరోనాతో ముప్పు లేదని సూచిస్తున్నారు. పోషకాలతో కూడిన ఆహారం ప్రతిరోజూ తీసుకుంటే కరోనా భారీన పడమని తెలిపారు. వ్యాయామం చేస్తూ ఆహారపు అలవాట్లను మార్చుకుంటే కరోనా సోకదని తెలిపారు. నిల్వ చేసిన ఆహార పదార్థాలు, రెడిమేడ్ ఆహారం, ఉప్పుతో కూడిన ఆహారం, ఫ్రిజ్ లో ఉంచిన ఆహారం, కూల్ డ్రింకులు తీసుకోవద్దని చెప్పారు. 
 
ప్రతిరోజు ఆహారం ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా కొంచెం కొంచెం తీసుకోవాలని అన్నారు. ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలని చెప్పారు. పచ్చి కూరగాయలు, పండ్లను సలాడ్ల రూపంలో తీసుకుంటే దీర్ఘకాల జబ్బులను నిరోధిస్తాయని అన్నారు. ఎ విటమిన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. 
 
కెరోటిన్ ఎక్కువగా ఉన్న బొప్పాయి, మామిడి, గుమ్మడి, క్యారట్, పాలకూర, తోటకూర, మెంతికూర తీసుకోవాలని చెప్పారు. పరిశుద్ధమైన నీటిని కాచి చల్లార్చిన పాలను తాగాలని అన్నారు. ప్రతిరోజు ఉడికించిన గుడ్డు, చికెన్, మటన్ తీసుకోవాలని సూచించారు. టిఫిన్ లో 2 ఇడ్లీలు, 150 మి.లీ. పాలు, 60 గ్రాముల గింజ ధాన్యాలు, 25 గ్రాములు పప్పులు తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్నం రెండు కప్పుల అన్నం లేదా మూడు పుల్కాలు, కూరగాయలు, 50 మి. లీ. పెరుగు, 50 గ్రాముల సలాడ్ తీసుకోవాలని చెప్పారు. రాత్రి భోజనంలో 2 కప్పుల అన్నం, 20 గ్రాముల పప్పు, 50 మిల్లీ లీటర్ల పెరుగు, 100 గ్రాముల మాంసం, 50 గ్రాముల సలాడ్ తీసుకోవాలని సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: