ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న  విషయం తెలిసిందే. అయితే దొంగతనానికి  పాల్గొనడమే కాదు పోలీసులకు దొరకకుండా ఉండేందుకు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు దొంగలు. దీంతో రోజు రోజుకు దొంగతనాలు పెరిగిపోతున్న దొంగలను పట్టుకోవడం పోలీసులుకు పెద్ద సవాలుగా మారిపోతుంది. ముఖ్యంగా దొంగతనాలు చేయడమే కాదు ఆ దొంగతనం చేసిన సొమ్మును భద్రపరిచేందుకు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ తెలివిగా ఆలోచిస్తున్నారు. ఇక దొంగతనాలు చేయడం లో ఒక్కో దొంగది ఒక్కో స్టైల్.. ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం చేసి ఎవరికీ తెలియకుండా... తమదైన స్టైల్లో దొంగతనం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఇలాంటి దొంగతనం జరిగింది... 

 


 ఇక్కడ ఓ దొంగ పలు ఇళ్లలో దొంగతనం చేసి బంగారాన్ని దొంగలించి ఎవరికీ తెలియని ఓ చోట దాచి పెట్టి కొన్ని రోజుల వరకు హాయిగానే బ్రతికాడు. కానీ చివరికి ఆ ప్లేస్ కాస్త పోలీసులకు తెలియడంతో కటకటాలపాలయ్యాడు ఇక్కడ ఒక దొంగ. ఇక ఈ దొంగ తెలివి చూసి పోలీసులు సైతం షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే... వనపర్తి పీర్ల కాలనీకి చెందిన పెద్దబుది  వంశీ పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. అయితే బాల్యం నుండే వంశీ వ్యసనాలకు బానిస గా మారిపోయాడు. దీంతో 13 ఏళ్ల నుంచే దొంగతనాలకు పాల్పడటం  మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే పోలీసులకు దొరికి జువైనల్ హోం లో శిక్ష కూడా అనుభవించాడు. బయటికి వచ్చి మళ్లీ తీరు మార్చుకోక పోవడంతో ఓ  కేసులో మళ్లీ చర్లపల్లి జైలు శిక్ష అనుభవించి తాజాగా విడుదలయ్యాడు. 

 


 అయితే వంశి వక్రబుద్ధి చూసీ  కుటుంబ సభ్యులు దరిచేరనివ్వలేదు.  దీంతో బస్టాండ్ రైల్వేస్టేషన్ సమీపంలో నిద్రపోతూ ఉండేవాడు. అదే సమయంలో అక్కడ పగటిపూట కాలనీలలో రెక్కీ నిర్వహించి అర్ధ రాత్రి కాగానే ఓ ఇనుప కడ్డీతో బయలుదేరి ఎలాగోలా ఇంట్లోకి ప్రవేశించే పాడు. ఇక ఇళ్లల్లో డబ్బు బంగారం దొంగలించి.. ఎంజీబీఎస్ సమీపంలోని మూసి నది ఒడ్డుకు చేరుకునే వాడు వంశీ. ఇతను దొంగతనం చేసిన బంగారు నగలను అక్కడ మూసీనది ఒడ్డున...పాతి పెట్టి ఎప్పటిలాగే చెత్త వేసి అతనికి మాత్రమే గుర్తుండేలా ఓ గుర్తు పెట్టేవాడు. అయితే ఇతను దొంగతనాలు చేసిన పరిసరాల ప్రజలందరూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో నిఘా పెట్టిన పోలీసులు... విశ్వసనీయ సమాచారం మేరకు వంశీ అరెస్ట్ చేసి విచారించగా అసలు నిజం బయటపడింది. ఈ క్రమంలోనే అతడు పాతిపెట్టిన స్థలం లోకి వెళ్లి తవ్విచూస్తే పోలీసులే అవాక్కయ్యారు. 16 తులాల బంగారం ఒకటిన్నర కిలోల వెండి బయటపడ్డాయి. కాగా మరో సారి ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి కటకటాల వెనక్కు తోసాడు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: