మొన్నటివరకు చైనా దేశంతో పాటు పలు దేశాలలో ప్రాణభయంతో వణికించిన కరోనా వైరస్ ప్రస్తుతం భారతదేశంలో కూడా శరవేగంగా వ్యాప్తిచెందిన  విషయం తెలిసిందే. ఇప్పటికే భారత దేశ వ్యాప్తంగా 28 కరోనా  పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాటు భారత ప్రజలు కూడా ఈ వైరస్ తో బెంబేలెత్తిపోతున్నారు. అయితే 28 పాజిటివ్ కేసులు నమోదు అయినప్పటికీ... ఈ ప్రాణాంతకమైన వైరస్ సోకిందనే ఎంతోమంది అనుమానితులు  కూడా చికిత్స పొందుతున్నారు. ఇక ఈ కరోనా  అనుమతులకు కరోనా  సోకిన వారికి ఐసొలేషన్  వార్డులో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే తాజాగా కరోనా వైరస్ సోకింది అన్న అనుమానంతో ఐసోలేషన్ వార్డులో ప్రత్యేక చికిత్స తీసుకుంటున్నా.. ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. 

 

 కరోనా  అనుమానిత రోగి మృతి చెందడంతో అతని అంత్యక్రియలు భద్రత మధ్య నిర్వహించిన ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... కేరళలోని పయ్యాన్నూర్  పట్టణంలో ఓ వ్యక్తి తీవ్రమైన జలుబు జ్వరంతో ఇటీవలే  మలేషియా  నుంచి కేరళ కి వచ్చాడు. ఇక అతనిలో కరోనా  లక్షణాలు ఎక్కువగా కనిపించడంతో అతని పై ఐసోలేషన్  వార్డులో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. అయితే కరోనా  అనుమానంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జైనేష్ ...  చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. అయితే జైనేష్ రక్త నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కి  పరీక్షల నిమిత్తం పంపించగా కరోనా వైరస్ లేదు అని నిర్ధారణ అయింది. 

 


 అయితే సదరు వ్యక్తికి కరోనా  వైరస్ లేదు అని తేలినప్పటికీ ఐసోలేషన్ వార్డులో  చికిత్సను అందించడం తదితర కారణాల ద్వారా... కరోనా  ఉందనే అనుమానంతో అతని మృతదేహాన్ని పలు వస్త్రం తో పాటుగా పాలిథిన్ కవర్లలో చుట్టేశారూ. ఇక కుటుంబ సభ్యులకు బంధువులకు కడ  చూపును కూడా దక్కనివ్వకుండా రెండు మీటర్ల దూరం నుంచే మృతదేహాన్ని చూడనిచ్చారు. ఇక ఆ తర్వాత ఎలాంటి ఆచారాలు పాటించకుండా కట్టుదిట్టమైన భద్రత మధ్య... అంత్యక్రియలు జరిపారు అధికారులు. అంతేకాదు చితాభస్మాన్ని కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వలేదు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: