అవును, ఇపుడు కరోనా వైరస్ భయం నలుమూలలా ఎగపాకింది. ఆఖరికి ధియేటర్ లోనికి కూడా. అవును ప్రేక్షకులు ఎక్కువ మంది ఎక్కడ వుంటారో అక్కడ తిష్ట వేస్తుంది కరోనా అనే సంగతి అందరికి తెలిసినదే. ఆ భయంతోనే త్వరలో మన థియేటర్లకు బంద్ ప్రకటించబోతోంది సదరు ధియేటర్ యాజమాన్య సంఘం. కరోనా కారణంగా ప్రేక్షకులు సినిమాలకు వెళ్లే అవకాశం లేదనే భయం కూడా వారికి ఉండటం గమనార్హం.

 

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో... కరోనా టెన్షన్ ప్రజలను మిక్కిలి ఆందోళనకు గురి చేస్తుండటం... ఇపుడు అది టాలీవుడ్‌ను ఆలోచింపజేసి, కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో కొంతకాలం సినిమాల విడుదలను వాయిదా వేసే యోచనలో టాలీవుడ్ పెద్దలు ఉన్నట్టు టాలీవుడ్ తాజా సమాచారం. అయితే ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ముందే... తామే ఓ నిర్ణయం తీసుకునే స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సహకరించాలనే యోచనలో టాలీవుడ్ సినీ పెద్దలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

 

ఇందుకోసం సినీ పెద్దలు ఈరోజు అనగా గురువారం సాయంత్రం అత్యవసర సమావేశం కాబోతున్నట్టు తాజా న్యూస్. అయితే ఈ భేటీలో కొన్ని రోజుల ధియేటర్స్ మూసివేతకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటారా లేక కరోనా విషయంలో ప్రజలకు అవగాహన కలిగించేందుకు తాము కూడా ముందుకు వచ్చి ప్రభుత్వానికి సహకరిస్తారా అనేది ఇంకా తెలియాల్సి వుంది.. ఇదే గాని నిజమైతే మాత్రం సదరు నిర్మాతలు నష్టపోయే పరిస్థితి ఉందని కూడా తెలుస్తుంది.

 

ఏదిఏమైనా, ప్రపంచ ప్రజలకు కరోనా ఫోబియా బాగా పట్టుకుంది. దీనికి నివారణ మార్గాలని.. ఎవరు ఏది చెప్పినా, దాన్ని గుడ్డిగా నమ్మి ఫాలో అయిపోతున్నారు ఎర్రి జనం. తాజాగా ఒక సంఘటన అందరి ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. అదే ఆవు పేడతో స్నానం. ఆవు పేడతో స్నానం చేసేవారికి ఈ వైరస్ అస్సలు  సోకదని ఎవరో చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మిన జనాలు పాపం ఆవుపేడతో స్నానాలు విపరీతంగా చేసేస్తున్నారు. అదేదో పుష్కర స్నానంలా...

మరింత సమాచారం తెలుసుకోండి: