తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ ఇద్దరు మంచి స్నేహితులే కాకుండా పాలనాపరంగా ఒకరికొకరు సహకరించుకుంటూ సమన్వయంతో మెలుగుతూ వివాదాస్పద అంశాలను కూడా సామరస్యంగా పరిష్కరించుకుంటూ వస్తున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడేందుకు కెసిఆర్ కూడా తగిన సహాయ సహకారాలు అందించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తెలంగాణలో కేసీఆర్ దూకుడుకు ఎక్కడా అడ్డూ, అదుపు లేకుండా ఉంది. ప్రజల్లో కేసీఆర్ పరిపాలన పై వ్యతిరేకత వ్యక్తమవుతుంది అనే ప్రచారం జరుగుతున్నా తెలంగాణలో జరిగే అన్నిఎన్నికల్లోనూ టిఆర్ఎస్ పార్టీ తన సత్తా చాటుతోంది. దీనివెనుక అధినేత కేసీఆర్ వ్యూహం చక్కగా పనిచేస్తోంది. అలాగే ప్రభుత్వం పై వ్యతిరేకంగా ఎవరు ఉద్యమాలు చేసినా కేసీఆర్ వాటిని ఎదుర్కొంటూ ప్రజల్లో మరింతగా పలుకుబడి పెంచుకుంటున్నారు. 

IHG


కొద్ది రోజుల క్రితం తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థలు, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడమే కాకుండా, దేశవ్యాప్తంగా సరికొత్త రికార్డును కూడా సృష్టించింది. ఈ విజయానికి కేసీఆర్ వ్యూహమే బాగా పనిచేసింది అనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. పార్టీ అభ్యర్థుల విజయంపై జగన్ ఒకవైపు ధీమాగా ఉన్నా, ఇప్పుడు వచ్చే ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ పనితీరుపై కూడా నిదర్శనం కావడంతో.. దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కెసిఆర్ ఏ విధంగా అయితే వ్యూహాన్ని అమలు చేశారో ఇప్పుడు అదే వ్యూహాన్ని అమలు చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగానే వీలైనంత వరకు ఏకగ్రీవాల మీద దృష్టి పెట్టాలని జగన్ తన పార్టీ కీలక నాయకులతో చెప్పినట్లు తెలుస్తోంది. 

IHG


ముఖ్యంగా ఎంపీటీసీ, జెడ్పి చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవి ఎవరికి ఇవ్వాలి అనే విషయాన్ని గోప్యంగా ఉంచాలని బయటకు పొక్కకుండా చూడాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సమాచారాన్ని లీక్ చేస్తే సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంటుందని జగన్ అంచనా వేస్తున్నారు. ఎన్నికలు పూర్తి అయ్యాక మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లా ఇంచార్జీ మంత్రులు అందరితో మాట్లాడిన తర్వాత వారిని ఫైనల్ చేద్దాం అని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే రకమైన వ్యూహాన్ని  తెలంగాణలో కేసీఆర్ అమలు చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అదే వ్యూహాన్ని ఏపీలో అమలు చేసి సక్సెస్ అవ్వాలని జగన్ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: