ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా కరోనా.. కరోనా.. కరోనా. అవును. ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న మాట ఇది. ఇప్పటివరకు భారత్‌లో దాదాపు 30 కేసులు కనుగొన్నారట. అయితే ఈ కరోనా అనేది కార్పొరేట్ మోసం అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసారు.. ప్రముఖ యాంకర్, బీజేపీ నేత శ్వేతారెడ్డి. ఇంతకీ ఆమె ఏమి మాట్లాడిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..

 

అన్ని టీవీ ఛానెల్స్‌లోను, పేపర్లలోనూ మాటి మాటికీ ఇదే చూపిస్తున్నారు. కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తే ఎవరికైనా అర్ధమౌతుంది.. కరోనా అనేది కార్పొరేట్ మోసం అని. అంటే ఫార్మాసూటికల్ కంపెనీలు తమ వద్ద ఉన్న మందులను అమ్మి సొమ్ము చేసుకోవడం కోసం వారే ఈ కరోనాను వ్యాపింపజేసి, ఆ తర్వాత వారి మందులనే ప్రజలు అధిక రేట్లకు కొనుక్కునేలా చేస్తున్నారని నేను కచ్చితంగా చెప్పగలను అని ఆమె బల్ల గుద్ది చెప్పారు. 

 

ఇంకా ఆమె మాట్లాడుతూ..ఈ కరోనా ద్వారా ‘ధ్రువ’, ‘రాజుగారి గది’ లాంటి సినిమాల స్క్రీన్ ఫ్లే లాంటిది. కరోనా పేరుతో ప్రపంచ జనాలను బెదరగొట్టి, తర్వాత ఏ అమెరికానో మరే దేశమో ఆల్రెడీ తయారుచేసిన మందును చూపించి ఇప్పుడే మందు కనిపెట్టేసాం అని కటింగ్ ఇచ్చి, వారు ఉన్న రేటు కంటే వెయ్యి రెట్లు ఎక్కువకు అమ్మి సొమ్ముచేసుకోవాలని చూస్తున్నారని ఆమె జోస్యం చెప్పారు. బి.జె.పి నేత గనుక ఆమె, ప్రపంచంలో భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు మోదీగారు ప్రయత్నిస్తున్న తరుణంలో దానిని చూసి ఓర్వలేక కొందరు ఇలాంటి వల్ల మాలిన పనులకు పూనుకున్నారని ఆరోపించింది.

 

ఎంతో చాక చక్యంగా అయోధ్య కేసు, ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 వంటి కేసులను తీర్చేసిన మోదీ.. సరిగ్గా సీఏఏ, ఎన్నార్సీ విషయంపై శ్రద్ధ పెడుతున్న సమయంలో కరోనా వ్యాపించడం  వెనుక పెద్ద కుట్రే దాగి ఉందని, ఆమె ఆరోపిస్తున్నారు. ఇక నేను మాత్రమే కాదు పార్లమెంట్‌లో జరుగుతున్న సమావేశాల్లో కూడా ఇదే చర్చ వినిపించింది. చాలా మంది అడ్వకేట్లు, పెద్ద పెద్ద నేతలు కూడా కరోనాకార్పొరేట్ మోసంలా అనిపిస్తోందని సందేహం వ్యక్తం చేయడం కొసమెరుపు అని ఆమె వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: