ఏపీ ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబు నాయుడుపై టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు నంద‌మూరి తార‌క‌రామారావు స‌తీమ‌ణి, ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమి ఛైర్ పర్సన్ శ్రీమతి లక్ష్మీపార్వతి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. నీచ రాజకీయాలతో చంద్రబాబు దారుణంగా దిగజారిపోయారని, ఇలాంటి నీచుడ్ని చరిత్రలో చూడలేదని విరుచుకుప‌డ్డారు. ఉద్యమం పేరుతో రైతులు, ప్రజల వద్ద నుంచి 70 లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. అమరావతిపై మహిళలను అడ్డుపెట్టుకుని నికృష్ట రాజకీయాలు చేస్తున్నారని విరుచుకుప‌డ్డారు. బినామి భూములకోసం దుర్మార్గ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

 

తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె తాజాగా మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు లాంటి నీచుడ్ని ఎక్కడా చూడలేదని మండిప‌డ్డారు. ``రాజధానిపై చంద్రబాబు మహిళలను ముందుపెట్టి కృత్రిమ ఉద్యమం చేస్తున్నాడు. ఇతర రాష్ట్రాల‌లో జరుగుతున్న ఉద్యమాల ఫోటోలు, వీడియోలు అమరావతిలో జరుగుతున్నట్లుగా మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారు. అమరావతి ఉద్యమం అంటూ జోలెపట్టి తనభార్య భువనేశ్వరి ద్వారా రెండు చేతిగాజులు ఇచ్చి  ప్రజల నుంచి బంగారు 24 గాజులు, 29 ఉంగరాలు, 41 చెవి పోగులు, మూడు గొలుసులు, నల్లపూసలు, మంగళ సూత్రాలు కూడా తీసుకున్న చరిత్ర చంద్రబాబుది. ఇలా దాదాపుగా 112 ఆభరణాలు తీసుకున్నాడు.ఇది ఉద్యమమా....నిజంగా ఉద్యమం చేసేవాడే అయితే ప్రజలను అడ్డుపెట్టుకుని సంపాదించిన లక్షల సొమ్ము ఉంది దానిని ఖర్చు పెట్టవచ్చుకదా?` అని ప్ర‌శ్నించారు. 

 

చంద్ర‌బాబు త‌న అక్ర‌మ డబ్బు తీసుకువెళ్లి విదేశాలలో దాస్తార‌ని ల‌క్ష్మీపార్వ‌తి ఆరోపించారు ``చంద్రబాబు సొంత డబ్బు ఖర్చు పెట్టి రైతుల కోసం ఉద్యమం చేయవచ్చుకదా?  అలా చేయ‌లేదు కానీ ప్ర‌జ‌ల నుంచి 70 లక్షల రూపాయలు వసూలు చేశాడు. అమాయకులైన రైతులను రోడ్డుపైకి లాగి మహిళలను అవమానిస్తున్న నీవు గతంలో ఇందిరాగాంధిని, ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచావు. నన్ను అడ్డుపెట్టుకుని నీచమైన రాజకీయాలు చేసి తర్వాత రోడ్డున పడేశావు. ప్ర‌స్తుతం అమరావతిలో ఎప్పుడూ బయటకు రాని మహిళలను అడ్డుపెట్టుకుని ఉద్యమం చేస్తున్నావు.నికృష్టమైన రాజకీయం కాదా ఇది?``` అంటూ మండిప‌డ్డారు.

 

``చంద్రబాబూ...నీ జీవితంలో ఒక్క మంచిపనైనా చేయగలిగావా? వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో పోలవరం ప్రారంభిస్తే ఒడిస్సా ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ కేసు వేయిస్తావు. పోతిరెడ్డిపాడుపై వైయస్ ఆర్ నిర్ణయం తీసుకుంటే తెలంగాణావారితో కేసు వేయిస్తావు.ఇప్పుడు కూడా జగన్ గారు తీసుకున్న దిశ చట్టంపై, నాలుగున్నరలక్షల ఉద్యోగాలపై కేసు వేయించావు.`` అని విరుచుకుప‌డ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: