కొందరు బ్రతకడం కోసం పుడతారు.. మరి కొందరు చావడం కోసం పుడతారు.. ఇంకొందరు తేడా గాళ్లు ఉంటారు.. వీరు చస్తూ బ్రతకడం కోసం పుడతారు.. ఎలాగంటే పనికిమాలిన టిక్‌టాక్‌లు పరిచయం చేస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటారు..చావలేక, బ్రతకలేక హస్పిటల్ పాలవుతూ బ్రతుకుతారు.. మొన్నటికి మొన్న, కాళ్లతో తన్నేసి క్రిందపడేసే గేమ్ ఆడి ఎందరో తలలు పగలగొట్టుకున్నారు. ఇప్పుడేమో ఉప్పు గేమ్ అని కొత్తగా కనిపెట్టారు.. ఈ ఆటకు వన్నె తెచ్చేలా సాల్ట్‌ చాలెంజ్‌ అని నామకరణం కూడా చేసారు..

 

 

ఇప్పటికే టిక్ టాక్ లో ఉన్న చాలెంజ్‌ల వల్ల తలలు బద్దలవుతుంటే సాల్ట్‌ చాలెంజ్‌ పేరుతో మరో కొత్త చాలెంజ్‌ వచ్చి చేరింది. ఈ గేమ్ వల్ల ఏరికోరి ప్రమాదాలను తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇకపోతే పనికి రాని ఈ ఛాలెంజ్ లో భాగంగా నోటి నిండా ఉప్పు గుమ్మరించుకోవాలి. అలా గుమ్మరించుకున్న ఉప్పును నోటిలో ఉంచేసుకోవాలి.. కాని నాలుకకు మోతాదుకు మించిన ఉప్పు తగలడం వల్ల వికారంతో కూడిన వాంతులు వస్తాయి..

 

 

సామాన్యంగా మనం తినే ఆహారపదార్ధాల్లో కాస్త ఉప్పు ఎక్కువైతేనే తట్టుకోలేము.. అలాంటిది ఏకంగా ఉప్పుడబ్బాతో నోట్లో ఉప్పు వేసుకోవడం అనేది బుద్దితక్కువ వాళ్లూ చేసేపని.. దీనివల్ల కలిగే ఆనందాన్ని పక్కన పెడితే తరచుగా ఇలా కనుక చేస్తే  రోగాలపాలవడం ఖాయం.. ఇక ఇంతటి మహత్తరమైనా ఆటను కనుగొన్న హీనుడు ఎవరయ్యా అంటే జొనాథన్‌ అనే టిక్‌టాక్‌ యూజర్‌ ఏ పని లేక పనికిమాలిన ఈ చాలెంజ్‌ను టిక్‌టాక్‌కు పరిచయం చేశాడట. ఇంక అంతే అందరూ దీన్ని ఫాలో అవుతున్నారు. మరో సారి గొర్రెల మందను తలపిస్తున్నారు..

 

 

ఇక ఈ ఛాలెంజ్ చాలా ప్రమాదమని.. ఉప్పును ఎక్కువ మోతాదులో తీసుకోవడం శరీరానికి అంత మంచిది కాదని, దీనివల్ల రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని  నిపుణుల హెచ్చరిస్తున్నారు.. అంతేకాదు ఇలా తీసుకున్న లవణం విషంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయట.. ఇంతగా ప్రమాదకరమైనప్పటికీ ఈ ఛాలెంజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవడం విచిత్రం..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: