అతి తక్కువ కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించిన కరోనా వైరస్ ఎవరికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.. ఆన్ని దేశాధినేతలకు అగ్ని పరీక్షలా మారింది.. పేరు చిన్నగా ఉన్నా దీని పనితనం మాత్రం విశ్వమంతా వ్యాపిస్తుంది.. అయితే ఈ కరోనా కోవిడ్-19గా పేరు మారినప్పటికీ ఎక్కువగా కరోనా అనే పిలుస్తున్నారు నెటిజన్లు. ఇకపోతే ఈ వ్యాధి అందరికి అంత త్వరగా వ్యాపించదట.. ముఖ్యంగా కొంత వయస్సు వారికి, కొన్ని కొన్ని లక్షణాలతో బాధపడేవారికి మాత్రమే ఇది త్వరగా వ్యాపిస్తుందట.. ఆ వివరాలు ఏంటో తెలుసుకుంటే..

 

 

కరోనా ముఖ్యంగా 70 ఏళ్లు పైబడిన వారికి త్వరగా సోకే వకాశం ఉందట.. ఇదే కాకుండా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు, చాలా వృధ్దాప్యంలో ఉన్నవారు లేదా తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్నవారు, వయస్సు కారణంగా బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగి ఉన్నవారు లేదా దీర్ఘకాలిక వ్యాధులు కలిగి ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నట్లు తేలిందట.. వీరితోపాటుగా దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, క్రానిక్ కార్డియాక్ డీసీస్, డయాబెటిస్ వారుకూడా ఈ కరోనా భారీనా పడే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు..

 

 

ఏది ఏమైనప్పటికీ ఈ వైరస్ దెబ్బకు ఇప్పటివరకు దాదాపు 3వేల 200మంది ప్రాణాలు కోల్పోగా...ఇందులో 3వేలమందికి పైగా చైనాకు చెందినవారే ఉండటం విషాదకరం... అందులోనూ ముఖ్యంగా వైరస్ మొదటగా వెలుగులోకి వచ్చిన వూహాన్ సిటీలోనే అధికస్థాయిలో మరణాలు నమోదయ్యాయి. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా 90వేలమందికి పైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడి హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. భారత్ లో కూడా ఈ వైరస్ సోకినవారి సంఖ్య 30కి చేరుకుంది. అయితే ఈ 30మందిలో అధిక భాగం ఇటలీ టూరిస్టులే ఉన్నారు..

 

 

ఇక చైనా నుండి వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం...1 సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న 9మంది ఆసుపత్రిలో చేరారని, అయితే ఇందులో ఎవరికీ ఇంటెన్సివ్ కేర్ అవసరం రాలేదని డాక్టర్లు కనుగొన్నారట. ఇదే కాకుండా చైనా నుంచి వచ్చిన మరో రిపోర్ట్ ప్రకారం... 44,672 కన్ఫర్మ్ కేసులలో 0.9 శాతం మంది మాత్రమే 9 సంవత్సరాల మరియు అంతకన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఉన్నారు.

 

 

ఇందులో 10 నుండి 19 సంవత్సరాల వయస్సులో ఉన్న వారు 1.2శాతం మంది ఉండగా. చాలా వరకు ధృవీకరించబడిన కేసులు 30 నుండి 79 సంవత్సరాల వయస్సులో ఉన్నావాళ్లే. కాబట్టి యువకులు, పిల్లలపై కన్నా వృద్ధులు అందులోనూ ముఖ్యంగా 60 ఏళ్లు పైబడి దీర్థకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిపైనే ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిసిందట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: