వైయస్ జగన్ నమ్మిన నాయకులలో ఒకరు అనిల్ కుమార్ యాదవ్. చాలా సందర్భాలలో అనిల్ కుమార్ యాదవ్ నీ తాను నమ్మిన బంటుగా జగన్ బహిరంగ సమావేశాలలో మరియు మీడియా ముందు చెప్పటం జరిగింది. అధికారంలోకి వచ్చాక కీలక శాఖ అయినా ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి వైయస్ జగన్ అప్ప చెప్పడం జరిగింది. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ లో అనిల్ కుమార్ యాదవ్ వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

 

సీనియర్ నేత చంద్రబాబునాయుడు అని లేదు ఇంకా కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందిన వయసు పైబడిన వాళ్ళని చాలా దారుణంగా అసెంబ్లీలో అనిల్ కుమార్ యాదవ్ విమర్శించడం జరిగింది. దొబ్బెయ్ ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా అనిల్ కుమార్ యాదవ్ వ్యవహరించారు. చాలా సందర్భాలలో అనిల్ కుమార్ యాదవ్ దురుసుగా ప్రవర్తించడాన్ని మీడియా వర్గం రౌడీ గా చిత్రీకరించడం జరిగింది. ఇటువంటి తరుణంలో కర్నూలు జిల్లా కి ఇన్చార్జిగా  వ్యవహరిస్తున్న అనిల్ కుమార్ యాదవ్ ఆ జిల్లాలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి క్లోజ్ గా వ్యవహరిస్తూ ఎస్సీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఆర్థర్ కి వ్యతిరేకంగా వ్యవహరించి అది నాయకుడు జగన్ దృష్టికి కోపం తెప్పించుకు నట్లయింది. ఇదే తరుణంలో ఇటీవల ఓ భారీ బహిరంగ సభలో ఎంతటివారైనా ఎంతటి పెద్దవారైనా వైయస్ జగన్ జోలికి వస్తే దాడి చేయడం గ్యారెంటీ అన్నట్టుగా అనిల్ కుమార్ యాదవ్ కామెంట్లు చేయటంతో ఈయన పై సోషల్ మీడియాలో మరియు ఏపీ రాజకీయాల్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

 

ఒక బాధ్యతగల మంత్రి పదవిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటం దారుణమని అంటున్నార. వైయస్ జగన్ మీద అభిమానం ఉంటే గుండెల్లో పెట్టుకోవాలని ప్రజల ముందుకు వచ్చి మంత్రి పదవిలో ఉండి ఈవిధంగా మాట్లాడటం తగదని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు కూడా కామెంట్ చేస్తున్నారు. మొత్తంమీద చూసుకుంటే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ని చూసి మంచి కంటే చెడే ఎక్కువగా వైసీపీ కార్యకర్తలు నేర్చుకుంటున్నారన్న విమర్శలు గట్టిగా వినబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: