2019 ఎన్నికల్లో ఏపీలో ఉన్న 13 జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఘోరమైన ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ పార్టీ 175 చోట్ల పోటీ చేసి కేవలం 23 సీట్లు తెచ్చుకుంది. అటు అన్నిజిల్లాలోనూ వైసీపీ జోరు చూపించి, 151 సీట్లు గెలుచుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ సీఎం అయిపోయారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చి 9 నెలలు దాటింది. అయితే ఈ 9 నెలల పాలన బట్టి చూస్తే వైసీపీ మెజారిటీ పెద్దగా పడిపోయినట్లు ఏం కనిపించడం లేదు. దీని బట్టి చూసుకుంటే వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మంచి ఫలితాలు రాబట్టగలదు.

 

అయితే వైసీపీకి కొన్ని జిల్లాలో టీడీపీ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషుకులు అంచనా వేస్తున్నారు. అలా వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే జిల్లాల్లో శ్రీకాకుళం కూడా ఉంటుందని అంటున్నారు. మొన్న ఎన్నికల్లో ఇక్కడ ఉన్న 10 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ రెండు గెలుచుకుంటే, వైసీపీ 8 స్థానాలు గెలిచింది. ఉన్న ఒక్క ఎంపీ సీటుని టీడీపీనే గెలుచుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు బట్టి చూస్తే వైసీపీకే మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

 

కానీ టీడీపీకి ఉన్న బలమైన నాయకత్వం, కేడర్ ఉంది. అలాగే అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, కళా వెంకట్రావు, కూన రవికుమార్, ఎమ్మెల్యే అశోక్, గౌతు ఫ్యామిలీ లాంటి వారు టీడీపీకి అండగా ఉన్నారు. ముఖ్యంగా జిల్లాలో కింజరాపు ఫ్యామిలీ హవా ఎక్కువ ఉంది. వారికి జిల్లాలో మంచి పట్టు ఉండటం వల్ల వైసీపీ కాస్త ఇబ్బంది పడే అవకాశముంది. అయితే వైసీపీలో ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంలాంటి బలమైన నేతలే కనిపిస్తున్నారు.

 

ఇక మంత్రి ధర్మాన కృష్ణదాస్ కాస్త దూకుడుగా లేకపోవడం వైసీపీకి మైనస్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదే క్రమంలో జిల్లాకు ఇన్‌చార్జ్‌ మంత్రిగా కొడాలి నాని ఉండటం కలిసొచ్చే అంశం. ఇప్పటికే జగన్ జిల్లాల్లో గెలుపు బాధ్యత మంత్రులకు, ఇన్‌చార్జ్ మంత్రులకు అప్పగించారు. దీంతో శ్రీకాకుళంలో గెలుపు బాధ్యతని కొడాలి తీసుకుని పని చేస్తున్నారు.

 

ఎప్పటి నుంచో జిల్లాలో ఎమ్మెల్యేలు, నాయకులని కలుపుని ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే కింజరాపు ఫ్యామిలీకు షాక్ ఇచ్చి, స్థానిక సమరంలో టీడీపీకి చెక్ పెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుని ఉన్నారు. మొత్తానికైతే శ్రీకాకుళంలో తన సత్తా ఏంటో చూపించి, వైసీపీ హవా కొనసాగించాలని కొడాలి డిసైడ్ అయ్యారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: