రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్ లో తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ విజయ రెడ్డి పై సురేష్ అనే రైతు లంచం అడిగినందుకుగాను పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తహసిల్దార్ల  సంఘం మొత్తం కొన్ని రోజులపాటు నిరసనలు కూడా తెలిపింది. అయితే ఇలా రైతులు ప్రజలు ఆగ్రహానికి లోనై  ఏకంగా పెట్రోల్ తో దాడి చేస్తునప్పుడుకీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినప్పటికీ అధికారుల తీరులో  మాత్రం మార్పు రావడం లేదని తెలుస్తోంది. దీంతో లంచగొండి మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తూనే ఉంది. 

 

 

 తాజాగా పెట్రోల్ బాటిల్ పట్టుకొని తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లిన ఉదంతం మరొకటి తెరమీదికి వచ్చింది. అయితే ఇది జరిగింది మరెక్కడో కాదు... సీఎం కేసీఆర్ సొంత జిల్లాలోనే ఇలాంటి ఘటన జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత ఇలాకా లోనే ఓ రైతు పెట్రోల్ బాటిల్ తో తహసిల్దార్ కార్యాలయం కి వచ్చాడు. సిద్దిపేట అర్బన్ తహసిల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

 

 

 

 ఎన్నో రోజుల పాటు తహసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి విసిగి పోయాడు రైతు... పని చేయమని అడిగితే 25 వేలు లంచం అడగడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక అధికారుల తీరుపై అసహనం తో పెట్రోల్ బాటిల్ పట్టుకొని తహసిల్దార్ కార్యాలయంలో కి వచ్చి తనపై పోసుకుని ఆత్మహత్య యత్నానికి  ప్రయత్నించాడు. ఇక అక్కడే ఉన్న వారు అప్రమత్తమై వెంటనే రైతును  అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రైతు.. భూ సమస్య పరిష్కారం కోసం కాళ్లరిగేలా తిరిగినా లంచం ఇస్తే పని చేస్తామంటూ అధికారులు తెలిపారు. తన బతుకు బండి నడవటమే  కష్టంగా ఉందని అలాంటిది లంచం ఎలా ఇస్తాను అంటూ మీడియా ముందు వాపోయాడు సదరు రైతు.

మరింత సమాచారం తెలుసుకోండి: