ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలోనే ఐదువేల అంగన్ వాడీ వర్కర్ల పోస్టులు భర్తీ చేసే అవకాశముంది . రాష్ట్రం లో ఐదు వేల అంగన్ వాడీ వర్కర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మహిళా శిశు, సంక్షేమ మంత్రి స్మృతి ఇరానీ  తెలిపారు . రాజ్యసభ లో గురువారం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా స్మృతి ఇరానీ ఈ విషయాన్ని వెల్లడించారు . 2019 డిసెంబర్ 31 నాటికి ఆంధ్ర ప్రదేశ్ లో 1665 అంగన్ వాడీ వర్కర్లు , 3347 అంగన్ వాడీ హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆమె చెప్పారు .

 

అంగన్ వాడీ వర్కర్లు , హెల్పర్ల ఖాళీలను ఆయా జిల్లాల కలెక్టర్లు  భర్తీ చేసేందుకు తగిన ఆదేశాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను  కోరుతున్నట్లు చెప్పారు . ఈ లెక్కన రాష్ట్రం లో ఖాళీగా ఉన్న అంగన్ వాడీ వర్కర్లు , హెల్పర్ల పోస్టుల భర్తీ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్నదని స్మృతి ఇరానీ చెప్పనే చెప్పారు . ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ సర్కార్ అధికారం లోకి వచ్చిన తరువాత నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్న విషయం తెల్సిందే .

 

గ్రామ వాలంటీర్ల పేరిట పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాన్ని కల్పించిన జగన్ సర్కార్ , వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటూ , నిరుద్యోగ యువత మన్నలను పొందుతోంది . ఇక రాష్ట్రం లో ఐదు వేల అంగన్ వాడీ ఖాళీలు ఉన్నట్లు కేంద్రం  ప్రకటించిన నేపధ్యం లో , రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఈ ఖాళీలను భర్తీ చేసే అవకాశాలు లేకపోలేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి .   

మరింత సమాచారం తెలుసుకోండి: