కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి మరోసారి మీడియా మందుకు వచ్చారు. ఈసారి చాలా గ్యాప్ తీసుకున్నారు కదా.. ఏదైనా కొత్త విషయాలు చెబుతారేమో అనుకున్నారు విలేఖరులంతా.. కానీ.. అబ్బే ఆయన తీరు మారలేదు.. అంతకు ముందు కొన్ని రోజుల క్రితం చెప్పిన సేమ్ టు సేమ్ డైలాగ్స్ మళ్లీ రిపీట్ చేసేశారు సుజనా చౌదరి గారు.

 

 

మరి ఈ సారి ఎందుకు ఈ ప్రెస్ మీట్ అంటారా.. అమరావతి రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి రాసిన పుస్తకాలను ఆయన మీడియాకు పరిచయం చేశారు. అందుకోసమే ఇప్పుడు మరోసారి ప్రెస్ ముందుకు వచ్చారు. అంతే తప్ప కొత్త విషయం మాత్రం ఏమీ లేదు. సేమ్ క్యాసెట్ రిపీట్. ఆయన ఏమంటున్నారంటే.. “ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోంది. రాజధాని ఉద్యమంలో ఏబై మంది రైతులు చనిపోయారు. "

 

 

"ఇక నైనా జగన్ సర్కారు కళ్లు తెరవాలి.. రాష్ట్ర భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టాలి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది.. రైతులపై లాఠీలు ఝుళిపించి పోలీసులు అరాచకం చేస్తున్నారు. ఈ అన్యాయాలపై పోరాడతాం.. ఏ స్థాయికైనా వెళ్తాం.. అంటున్నారు సుజనా చౌదరి.

 

 

వైకాపా నేతలు అమరావతిలో ఒకమాట.. దిల్లీలో మరోమాట చెబుతున్నారని సుజనా చౌదరి అంటున్నారు. అంతేకాదు.. ఏపీ అంటేనే పారిశ్రామిక వేత్తలు పారిపోతున్నారని సుజనా చౌదరి కామెంట్ చేస్తున్నారు. వివిధ వర్గాల మధ్య ప్రభుత్వం చిచ్చు పెడుతోందని సుజనా ఆరోపిస్తున్నారు. అయితే సుజనా చౌదరి ప్రెస్ మీట్లో కొత్త గా చెప్పిన విషయం ఇసుమంతైనా లేదు. మరి ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆయన ఏం చెప్పదలచుకున్నారో..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: