ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల నిర్ణయం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. విపక్ష పార్టీలు మరియు అమరావతి రాజధాని ప్రాంత రైతులు తీవ్రస్థాయిలో సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. దాదాపు రెండు నెలలకు పైగా రాజధాని ప్రాంత రైతులు అమరావతిలో దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. అయినా గాని ఎక్కడా కూడా ప్రభుత్వంలో చలనం లేదు. దీంతో ఈ విషయం పట్ల బీజేపీకి జగన్ తీసుకున్న నిర్ణయాన్ని చెప్పి చెక్ పెట్టాలని చాలామంది అమరావతి కి సపోర్ట్ చేసేవాళ్ళు ప్లాన్ వేయడం జరిగింది. మరోపక్క అసలు ఈ విషయంలో బీజేపీ ఏ విధంగా స్పందిస్తుందో అంటూ చాలామంది వెరైటీగా ఆలోచించారు.

 

అయితే రాష్ట్రంలో జగన్ పరిపాలనకు ప్రజలు బ్రహ్మరథం పడటంతో బిజెపి పార్టీ నాయకులు కూడా పెద్దగా స్పందించలేదు. అదే సమయంలో అమరావతి బాధితులకు కూడా పెద్దగా భరోసా ఇవ్వలేదు. ఇలాంటి సమయంలో బీజేపీ మంత్రులు ఇద్దరు… రెండు రాష్ట్రాల్లో మూడు రాజధానుల దిశగా అడుగులు వేస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యురప్ప ఈ విషయంలో ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా కీలక అడుగు వేసారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గైర్సేన్‌ను వేసవి రాజధానిగా ప్రకటిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కీలక ప్రకటన చేసారు.

 

గైర్సేన్‌లో జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేసారు.  ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి వెల్లడించారు. గైర్సేన్‌లో వేసవి రాజధాని ఉంటుంది, డెహ్రాడూన్ నుంచి పరిపాలన కొనసాగుతుంది అని పేర్కొన్నారు. దీంతో మూడు రాజధానుల విషయంలో భారతీయ జనతా పార్టీ ఇండైరెక్టుగా ఎవరికీ చెప్పకుండా జగన్ కి కొండంత సపోర్ట్ ఇచ్చినట్లే అని, అమరావతి రైతులు దీక్షలు చేసినా పెద్దగా ఉపయోగం ఉండదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: