జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన  మూడు రాజధానుల విషయంలో  రెఫరెండం పెట్టాలన్నాడు. ప్రజలంతా జగన్ పాలనపై మండిపోతున్నట్లు ఊరువాడ ఎక్కి మరీ అరుస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలంటే వైసిపి ఓటమి ఖాయమని జోస్యం కూడా చెప్పేస్తున్నారు. మరిన్ని చెబుతున్న చంద్రబాబునాయుడు అండ్ కో స్ధానిక సంస్దల ఎన్నికల్లో పాల్గొనాలంటే ఎందుకు భయపడుతున్నారు ? ఆ భయంతోనే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బిసిల రిజర్వేషన్ శాతం 34 ఉండాల్సిందేనంటూ సుప్రింకోర్టుకు ఎందుకు వెళ్ళినట్లు ?

 

ఎందుకంటే బిసిలకు ప్రభుత్వం కల్పించిన 34 శాతం రిజర్వేషన్ రాజ్యాంగం ప్రకారం చెల్లదంటూ హైకోర్టు తీర్పిచ్చింది. అనేక కారణాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం హైకోర్టు ఆదేశించినట్లుగా 24 శాతంతోనే ఎన్నికలు నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగానే ఎన్నికల ఏర్పాట్లకు రెడీ అవుతోంది. దీన్ని చంద్రబాబు తప్పు పడుతూ సుప్రింకోర్టులో కేసు వేయించారు. ఎంపిలు రామ్మోహన్ నాయుడు, నేతలు నిమ్మల కిష్టప్ప, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపి కొనకళ్ళ నారాయణ సుప్రింకోర్టులో కేసు వేశారు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బిసిల రిజర్వేషన్ 34 శాతం రాజ్యాంగ విరుద్ధమంటూ కోర్టులో కేసు వేయించిందే చంద్రబాబు. తన మద్దతుదారునితో చంద్రబాబు కేసు వేయించకపోతే రేపటి ఎన్నికల్లో బిసిలకు  34 శాతం రిజర్వేషన్లు వర్తించేవే. కానీ ఒకవైపు కేసు వేయించి బిసిలను దెబ్బ కొట్టి మళ్ళీ ఇపుడు సుప్రింకోర్టులో 34 శాతం కావాలంటూ చంద్రబాబే కేసు వేయించటమే విచిత్రం. ఇదంతా ఎందుకు చేస్తున్నట్లంటే ఎన్నికలు జరగకుండా అడ్డుకోవటం కోసమే. ఎన్నికల్లో పాల్గొనేందుకు టిడిపి సిద్ధంగా లేరు.

 

ఒకవేళ ఎన్నికలంటు జరిగితే ఫలితాలు ఎలాగుంటాయో చంద్రబాబుకు అర్ధమైపోయింది. అంటే రెఫరెండం జగన్ కే అనుకూలంగా ఉంటుందని తెలిసిపోయింది. ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ఓట్లేసిన వాళ్ళంతా రేపటి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా ఓట్లేస్తారు. అప్పుడు చంద్రబాబు పరువు పోతుంది. దాంతో ఎలాగైనా సరే ఎన్నికలు జరక్కుండా అడ్డుకోవాలన్న కుట్రతోనే సుప్రింకోర్టులో కేసు వేయించాడు. ఒకవేళ సుప్రింకోర్టు గనుక స్టే ఇస్తే అప్పుడు ఎన్నికలూ ఆగిపోతాయి కేంద్రం నుండి రావాల్సిన నిధులూ ఆగిపోతాయి. అంటే చంద్రబాబు ఏస్ధాయిలో కుట్రలు చేస్తున్నాడో అర్ధమవుతోందా ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: