స్నేహితురాలి  పెళ్లి కుదిరింది అని ఎంతో ఆనంద పడ్డారు. ఇక పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లికి వెళ్లి ఎంతో ఆనందంగా గడపాలని అనుకున్నారు. కానీ పెళ్లి నుంచి తిరిగి వస్తున్న క్రమంలో వారి జీవితాల్లో విషాదం నిండిపోయింది. అతివేగం ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. ఒక్క ప్రమాదం 3 కుటుంబాల్లో విషాదం నింపింది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు  మృతి చెందారు. ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగి పోతున్న విషయం తెలిసిందే. అతివేగం ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోవడం వెరసి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఇంకెంతో మంది జీవచ్చవంలా మారిపోతున్నారు. ఎన్నో  కుటుంబాల్లో విషాదం నిండిపోతుంది. 

 

 

 తాజాగా అతివేగం ఆ ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. నిజాంబాద్ జిల్లా లోని మోపాల్ మండలం బాడ్సి  గ్రామానికి చెందిన బాలకృష్ణ గౌతంరెడ్డి నిజామాబాద్ కు  చెందిన నిఖిల్ కుమార్... మరో ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో దర్పల్లి లో జరిగిన చిన్ననాటి స్నేహితురాలి  వివాహానికి వెళ్లారు. పెళ్లిలో  ఎంతో ఆనందంగా గడిపారు. ఇక పెళ్లి ముగిసిన అనంతరం ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలోనే వారికి అనుకోని ప్రమాదం ఎదురైంది. ఇందల్వాయి పోలీస్ స్టేషన్ సమీపంలోకి రాగానే ఆ యువకులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. 

 

 

 ఈ ప్రమాదంలో యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఇక అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులకు సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకులను వెంటనే నిజాంబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలకృష్ణగౌతమ్ రెడ్డి,  నిఖిల్ కుమార్ లు   ప్రాణాలు విడిచారు  మరో స్నేహితుడు సాయి సాకేత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణం అతి వేగమే అని తెలుస్తోంది. అతి వేగంగా కారు నడపడం వల్లే... అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది అన్నట్లుగా  పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: