ప్రస్తుతం ప్రపంచాన్ని ఏదైనా  వణికిస్తోంది అంటే అది కచ్చితంగా కరోనా వైరస్ అనే చెప్పాలి. ఎందుకంటే చైనాలోను వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది.. ఈ వైరస్ ప్రస్తుతం భారత్ లోకి వ్యాపించి ప్రజలను భయపెడుతుంది. అలాంటి ఈ దారుణమైన వైరస్ ను వ్యాప్తి చెందకుండా ఉండాలి అని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

 

ఈ నేపథ్యంలోనే ఈ కరోనా వైరస్ గురించి భారతీయ శాస్త్రవేత్త గగన్ దీప్ కాంగ్ ను ప్రశ్న అడిగితే ఆమె సంచలన విషయాన్నీ బయటపెట్టారు. ఆ విషయం ఏంటి అంటే? కరోనా వైరస్ ను భారతీయులు తట్టుకోగలరా అని ఆమెను ప్రశ్నించగా కచ్చితంగా తట్టుకోగలరు అని ఆమె చెప్పారు. 

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న గగన్ డీప్ గతంలో ఎన్నో పరిశోధనలు చేసి వాటికీ అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. ప్రఖ్యాత రాయల్ సొసైటీ ఫెలోషిప్‌ ని ఆమె . నార్వే ఆధారంగా అంటువ్యాధుల సన్నద్ధత కార్యక్రమంకు ఆమె పని సీఈపీఐకి ఉపాధ్యక్షరాలిగా ఉన్నారు. 

 

అయితే ఈ నేపథ్యంలోనే కరోనాను తట్టుకునే శక్తి భారతీయులకు ఉంది అని ఆమె చెప్తున్నారు. కరోనాకు భారతీయులు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు అని.. ఈ వైరస్‌ సోకిన ప్రతి ఐదుగురిలో నలుగురికి ప్రత్యేక వైద్యం అవసరం లేకుండానే తగ్గిపోతుంది అని ఒకవేళ అంతగా అవసరమైతే పారాసిటమాల్‌ వాడితే సరిపోతుంది అని. అది కూడా సాధారణ జలుబు, జ్వరానికి వాడినట్లే అని కరోనాకు వాడాలి అని.. పెద్దగా దీనికి భయపడాల్సిన అవసరం లేదు అని ఆమె చెప్తున్నారు..

 

అయితే ఈ వైరస్ కారణంగా వృద్ధులకు ఇబ్బంది ఉంటుంది అని.. చిన్నారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఈ వైరస్ సోకితే జ్వరంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడే వారు ఆస్పత్రికి వెళ్తే సరిపోతుంది అని ఆమె పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: