ప్రపంచంలో ఎన్నో వైరస్ లు వచ్చాయి.. వాటి వల్ల ఎంతో మంది ప్రమాదాలకు గురి అయ్యారు.  అయితే వాటికి యాంటీ డోస్ కనిపెట్టి రోగాలను నివారించగలిగారు.  కానీ ఇప్పుడు చైనాలో పుహాన్ లో ప్రబలిన కరోనా కోవిడ్-19 (కరోనా) వల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయని.. మనుషు చనిపోతున్నారని వార్తలు రావడంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని జనాలు భయపడిపోతున్నారు.  అయితే కరోనా వైరస్ వల్ల ప్రాణహాని ఉంటుంది.. కానీ దాన్ని మనం సుచీ, శుభ్రత పాటించి అరికట్టవొచ్చని డాక్టర్లు సలహాలు ఇస్తున్నారు. కరోనా ప్రభావం చూపుతున్న ప్రదేశాల్లో ఎక్కువగా సంచరించకపోవడం మంచింది. వీలైంత వరకు మాస్క్ ధరించి బయటకు వెళ్లాలి.. షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు... వీలైనంత వరకు చేతులు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచనలు ఇస్తున్నారు డాక్టర్లు. 

 

అయితే విద్యార్థుల్లో ఎవరికైనా జలుబు, జ్వరం ఉంటే, వారు స్కూలుకు రావద్దని పాఠశాల విద్యా శాఖ అడిషనల్ డైరెక్టర్ సీహెచ్ రమణ కుమార్ ఆదేశించారు.  విద్యార్థులకు అవగాహన కూాడా కల్పిస్తున్నారు. ప్రస్తుం ఎగ్జామ్స్ సమయం కావడంతో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం ఉన్నా పాఠశాలకు రావొద్దని.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ కార్యాలయం, జిల్లాల పరిధిలో డీఈఓలు వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఇక కరోనా వైరస్ కలకలం రేపుతున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.

 

సిద్ధలక్ష్మి అనే మహిళ దాఖలు చేసిన పిల్‌పై స్పందించి రేషన్ దుకాణాల ద్వారా మురికివాడల్లోని పేదలకు మాస్కులు, శానిటైజర్లను ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పుడు మెడికల్ షాపుల్లో మాస్క్ లకు బాగా గిరాకీ పెరిగిపోయింది.. రూ. 5 కి అమ్మాల్సిన మాస్క్ ఏకంగా రూ. 50 వరకు అమ్ముతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇక బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. కాగా, ప్రభుత్వం తరపున కోర్టుకు హాజరైన ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శంకర్, కరోనా వైరస్ నివారణకు తీసుకుంటున్న చర్యలను ధర్మాసనానికి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: