ఇద్దరు ఎంపిల మధ్య అమరావతి చిచ్చు మామూలుగా లేదు. ఒకరు చెప్పినదానిని వెంటనే మరొకరు ఖండిచుకునేంతగా అగాధం పెరిగిపోయింది. విచిత్రమేమిటంటే ఇద్దరు బిజెపికి చెందిన రాజ్యసభ ఎంపిలే. ఈ పాటికే వీళ్ళద్దరు ఎవరో అర్ధమైపోయుంటుంది. అవును ఒకరేమో జీవిఎల్ నరసింహారావు మరోకరేమే టిడిపి ఫిరాయింపు ఎంపి సుజనా చౌదరి. సుజనా ఏమో చంద్రబాబు ఇంట్రస్టులే ధ్యేయంగా పనిచేస్తుంటే జీవిఎల్ మాత్రం కేంద్రప్రభుత్వ వైఖరి ప్రకారమే నడుచుకుంటున్నారు.

 

ఇంతకీ ఇద్దరి మధ్య సమస్య ఏమిటంటే మూడు రాజధానుల ఏర్పాటుపై జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదనే కారణం. రాజధాని అమరావతిని ఒక ఇంచుకూడ తరలించలేరని, కేంద్రం చూస్తు ఊరుకోదని సుజనా పదే పదే చెబుతున్నారు. అంటే ఈయన చేస్తున్న ప్రకటనలన్నీ చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగానే ఉంటున్నాయి. ఇక జీవిఎల్ మాత్రం కేంద్రప్రభుత్వ వైఖరి ప్రకారమే మాట్లాడుతున్నారు. రాజధాని ఏర్పాటు పూర్తిగా రాష్ట్రప్రభుత్వం పరిధిలోని వ్యవహారమని చెబుతున్నారు. కాబట్టి కేంద్రం ఎట్టి పరిస్దితుల్లోను జోక్యం చేసుకోదని స్పష్టంగా ప్రకటించేశారు. ఇద్దరిలో ఎవరు చెప్పిం కరెక్ట్ ?

 

ఎవరిదంటే జీవిఎల్ చెప్పిందే వాస్తవమని అనుకోవాలి. ఎందుకంటే జీవిఎల్ చెప్పిన విషయాన్నే స్వయంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి పార్లమెంటులో ప్రకటన రూపంలో చెప్పారు కాబట్టి. అయినా సరే సుజనా పాత పాటనే ఎందుకు పాడుతున్నాడంటే ఆయన కూడా అమరావతి ప్రాంతంలో వందల ఎకరాలు భూమిని కొన్నాడు కాబట్టే. రాజధాని గనుక అమరావతి నుండి వెళ్ళిపోతే కొనుక్కున్న భూమల ధరలన్నీ ఒక్కసారిగా పడిపోతాయి కాబట్టే.

 

అసలు మొదటి నుండి చంద్రబాబు అండ్ కో తో పాటు పచ్చమీడియా గోల కూడా ఇదేకదా. తాజాగా జీవిఎల్ ఏమి చెప్పాడంటే రాష్ట్రపార్టీ తీర్మానం చేసినంత మాత్రాన కేంద్రం వినాల్సిన అవసరం లేదన్నారు. ఉత్తరాఖండ్ కు మూడు రాజధానులని అక్కడి సిఎం ప్రకటన చేస్తే చేంద్రం ఏమన్నా అభ్యంతరం చెప్పిందా ? అంటూ ఎదరు ప్రశ్నించాడు. కాబట్టి ఇక్కడ కూడా జీవిఎల్ చెప్పిందే కరెక్ట్. మరి ఈ విషయంలో ఇద్దరి ఎంపిల మధ్య మొదలైన గొడవ చివరకు ఎక్కడికి దారితీస్తుందో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: