తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ ఒకటో తేదీతో మొదలై వచ్చే ఏడాది మార్చి 31తో ముగిసే నూతన ఆర్థిక సంవత్సరం (2020-2021) బడ్జెట్‌కు ఆమోదం తెలిపే ప్రక్రియలో భాగంగా ఉదయం 11 గంటలకు సభ కొలువుదీరింది.  ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అసెంబ్లీ, మండలి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.  ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అసెంబ్లీ, మండలి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బడ్జెట్‌ సమావేశాలు కావటంతో తొలి రోజు శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగించారు. తమిళిసై అసెంబ్లీలో చేస్తున్న తొలి ప్రసంగం ఇదే.

 

నుండగా, మండలిలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత శాసనసభ, శాసనమండలిని ఎన్ని రోజులపాటు నిర్వహించాలనేది బీఏసీ నిర్ణయిస్తుంది. మొత్తంగా 13 రోజుల పాటు శాసనసభను జరపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సమావేశాలకు అనుగుణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని సీఎం కేసీఆర్ మంత్రిమండలి, పార్టీ సమావేశాల్లో గతంలోనే సూచించారు. సభ రోజువారీ కార్యకలాపాలపై పార్టీ అనుసరించాల్సిన వైఖరిని కూడా కేటీఆర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ రూపొందిస్తుంది.

 

సభకు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. గవర్నర్‌ ప్రసంగం ముగిసిన అనంతరం శాసనసభ, మండలి సమావేశాల ఎజెండాను ఖరారు చేయడానికి బీఏసీ సమావేశం కానుంది. రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీపై బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు.  గతేడాది సెప్టెంబరు 22న శాసనసభ, మండలి సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. తెలంగాణలో దాదాపు ఆరు నెలలకు జరుగుతున్న బడ్జెట్ సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: