మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాలో బిసి ఓటర్ల సంఖ్య దాదాపుగా 50 శాతం పైగా ఉంది. అయితే అనాదిగా వీరంతా తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద మద్దతుదారులు. గతంలో తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినా కూడా వీరివల్ల ఒక గౌరవప్రదమైన స్థానంలో నిలిచేవది కానీ ఎవరికీ అర్థం కాని రీతిలో 2019 ఎన్నికల్లో బీసీలు అంతా వైసిపి వైపుకి మళ్ళారు. అప్పటి నుంచి జగన్ బీసీల ఓటు బ్యాంకు ను బలపరచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగానే నామినేటెడ్ పదవులు, ఆలయ పాలక వర్గాలు, మంత్రివర్గం, కాంట్రాక్టులు అన్నీనూ.

 

IHG

 

ఇప్పుడు జగన్ మరొక అడుగు ముందుకు వేసి బీసీలకు స్థానిక ఎన్నికల్లో పెద్దఎత్తున రిజర్వేషన్లు ఇస్తూ 59.85% గా నిర్ణయిస్తూ జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కానీ హైకోర్టు రిజర్వేషన్లు కొట్టేస్తూ వాటిని 50 శాతానికి కుదించింది అని చెప్పడంతో బీసీల తో పాటు జగన్ కూడా పెద్ద దెబ్బ పడింది. ఒకవేళ హైకోర్టు సానుకూలంగా స్పందించి ఉంటే 15 వేలకు పైగా పదవులు అన్ని రంగాల్లో బీసీలకు అదనంగా లభించేవి.

 

IHG

 

ఇదే అదనుగా భావించిన చంద్రబాబు పార్టీ జగన్ కి బీసీలపై ప్రేమ లేదని కేవలం కక్ష మాత్రమే ఉందని దుమ్మెత్తి పోయడం మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీ నేత యనమల రామకృష్ణుడు ఈ వ్యాఖ్యలు మనం ఇటువంటి వ్యాఖ్యలు గమనించవచ్చు. అంతేకాకుండా వైసీపీకి  చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు దాకా వెళ్లి బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేసే వారిని కూడా వాళ్లు విమర్శించడం మొదలుపెట్టారు. మరోవైపు వైసీపీ కూడా హైకోర్టులో అలా జరగడానికి వెనుక ఉన్నది బాబే అని.... కుట్రపూరితంగా తన పార్టీకి చెందిన బిర్రు ప్రతాప రెడ్డి చేత హైకోర్టులో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్ వేయించి వాటిని ఆపాడని బొత్స సత్యనారాయణ విమర్శించాడు.

 

ఇప్పుడు ఆంధ్రాలో పరిస్థితి రకంగా ఉన్నందున బీసీలు చివరికి పార్టీ వైపు మొగ్గు చూపుతారని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి ఓట్లను బట్టే హీరో అవుతారో ఎవరో జీరో కానున్నారో డిసైడ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: