తెలంగాణలో ఫామ్ హౌస్ రాజకీయాలు ఎక్కువయ్యాయి. ఈ ఫామ్ హౌస్ రాజకీయాలకు తెర లేపింది తెలంగాణ సీఎం కేసీఆర్. ఎర్రవల్లి లో కెసిఆర్ కు వ్యవసాయ క్షేత్రం ఉంది. తరచుగా ఆయన అక్కడికి వెళుతూ, అనేక రాజకీయ నిర్ణయాలు అక్కడి నుంచే తీసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి రెండు మూడు రోజులపాటు కేసీఆర్ ఆ ఫామ్ హౌస్ లోనే ఉంటారు. కేసీఆర్ కు ఫామ్ హౌస్ అంటే ఎంతో మక్కువ. ఎవరైనా విదేశీ ప్రతినిధులు తెలంగాణకు వచ్చినా కేసీఆర్ ఫామ్ హౌస్ కి తీసుకువెళ్లి చూపిస్తూ ఉంటారు. దీనిపై టిఆర్ఎస్ రాజకీయంగా అనేక విమర్శలు ఎదురుకుంది. ఫామ్ హౌస్ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా కేసీఆర్ పట్టించుకునేవారు కాదు. ప్రస్తుతం కేటీఆర్ పై విమర్శలు పెరిగాయి. 

IHG

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కేటీఆర్ ఫామ్ హౌస్ వెలుగులోకి తీసుకొచ్చారు. అసలు కేటీఆర్ కు ప్రత్యేకంగా ఓ ఫామ్ హౌస్ ఉన్న సంగతి ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. నిబంధనలకు విరుద్ధంగా ఆయన దీనిని  నిర్మించారని, అది బినామీ పేర్లతో ఉన్న కేటీఆర్ ఫామ్ హౌస్ అని రేవంత్ ఆరోపణలు చేయడమే కాకుండా, డ్రోన్ కెమెరా తో ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాలను చిత్రీకరించి ఈ వ్యవహారాన్ని మరింత రచ్చ చేశారు. అయితే దీనిపై కేటీఆర్ స్పందించలేదు. కానీ ఆ పార్టీ నాయకులు ప్రెస్ ఎస్ మీట్ ఏర్పాటు చేసి అది కేటీఆర్ ఫామ్ హౌస్ అని, తామంతా అక్కడికి అనేకసార్లు అక్కడకు వెళ్ళమని, లీజుకు తీసుకున్న డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయంటూ టిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ సన్నిహితుడు బాల్క సుమన్ ప్రకటించారు.

IHG

 

 కేవలం డ్రోన్ కెమెరాతో ఫామ్ హౌస్ చిత్రీకరించారని రేవంత్ రెడ్డి పై కేసు పెట్టడమే కాకుండా, హడావిడిగా ఎయిర్ పోర్ట్ కు వెళ్లి ఆయనను అరెస్టు చేశారు. దీంతో ఫామ్ హౌస్ లో ఏదో జరుగుతోందని, రేవంత్ ఆరోపించినట్లుగా అక్కడ ఏవో అక్రమాలు జరుగుతున్నట్లు ప్రజల్లో చర్చ మొదలైంది. లేకపోతే డ్రోన్ కెమెరా వీడియో తీసిన కారణంగా ఇంత హడావిడిగా ఎందుకు అరెస్ట్ చేస్తారనే వాదన కూడా తెరపైకి వచ్చింది. ఒకవేళ నిజంగా అరెస్ట్ చేయాలని ఉద్దేశం ఉంటే, భూ వ్యవహారాల్లో ఆయన అక్రమాలకు పాల్పడ్డారని రేవంత్ రెడ్డి పై కేసులు కూడా నమోదయ్యాయి. 

 

IHG

ఈ కేసులో భాగంగా రేవంత్ ను అరెస్ట్ చేసి ఉంటే, రేవంత్ తప్పు చేశాడు కాబట్టి అరెస్టు చేశారు అనే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో ఉండేది. కానీ డ్రోన్ కెమెరా వీడియో తీశారనే చిన్న కారణంతో హడావిడిగా ఆయనను ఎయిర్ పోర్ట్ కు వెళ్లి మరీ అరెస్టు చేయడంతో కేటీఆర్ ఫామ్ఏ హిఉసే లో ఏదో జరుగుతుందనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: