ప్రపంచాన్ని వణికిస్తున్న కోరోనా ఇప్పుడు ఎవ్వరినీ వదలడం లేదని అంటున్నారు.  చైనాలోని వుహాన్ నగరంలో తొలిసారి వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.  ఇప్పటికే 60 దేశాలకు పైగా ఈ కరోనా ఎఫెక్ట్ తో చైనాలో 3 వేలకు పైగా మరణాలు సంబవించాయని వార్తలు వస్తున్నాయి.  ఒక్క చైనాలోనే కాదు అమెరికా, ఆస్ట్రేలియా, ఇరాన్, కొరియా ఇతర దేశాల్లో ఈ కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతుంది. భారత్ లో సైతం కరోనా ఎఫెక్ట్ తో ఒక మరణం సంభవించిందని అంటున్నారు.  

 

కరోనా వైరస్‌ వ్యాప్తి వేగంగా ఉన్నందున ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్రం హెచ్చరించింది.  ఇప్పటికే భారత్ లో పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, సిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు అన్ని ముందుజాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే ఆయా రాష్ట్రల్లో కరోనా అనుమానితులను పరీక్షిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ లో గాంధీ ఆసుపత్రిలో కరోనా ప్రభావితులు చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ ఆదేశాలు జారీ చేశారు .  కరోనాతో తాజాగా ఇరాన్ మాజీ దౌత్యాధికారి కోవిడ్‌తో మృతిచెందారు. 

 

సిరియాలో ఇరాన్ దౌత్యవేత్తగా పనిచేసిన హోసేన్ షేఖోస్లామ్ కరోనా వైరస్‌తో చనిపోయినట్టు ఆ దేశ అధికారిక మీడియా గురువారం ప్రకటించింది. అంతే కాదు మరో 15 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టు ఇరాన్ ఆరోగ్య, వైద్య విద్యా శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే.. కరోనా వైరస్‌తో గురువారం మరో 30 మంది చనిపోయినట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది.   చైనాలోని వుహాన్ మాదిరిగా దక్షిణ కొరియాలోని డేగూ నగరం వైరస్‌కు కేంద్రస్థానంగా మారింది. శుక్రవారం కొత్తగా 518 కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకీ కరోనా మరణాలు పెరుగుతున్నాయి.. దీని యాంటీడోస్ ఇంకా కనుగొనని కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: