రెండు దశాబ్దాల పాటు వైసిపినే అధికారంలో ఉండాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపిచ్చాడు. పదేళ్ళ పాటు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న విజయాన్ని మరో రెండు దశాబ్దాల పాటు నిలుపుకోవాలంటే రాబోయే ప్రతి ఎన్నికలోను అందరూ రెట్టించి పని చేయాల్సుంటుందని సజ్జల చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. వైఎస్సార్ కలలుగన్న అభివృద్ధిని అందరూ కలిసికట్టుగా కృషి చేసి నిజం చేయాలని ఆయన చెప్పారు.

 

అనంతపురంలో జరిగిన జిల్లా పార్టీ సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబునాయుడు మీద టిడిపి ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు లేండి. సరే ఇదంతా మామూలే అనుకున్నా రెండు దశాబ్దాల పాటు అధికారంలో ఉండాలని కోరుకోవటమే కాస్త ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఇదివరకు చంద్రబాబు, చినబాబు, స్పీకర్ గా పనిచేసిన దివంగత నేత కోడెల శివప్రసాద్ రావు కూడా మరో 30 ఏళ్ళు అధికారంలో టిడిపినే ఉండాలంటూ ఎన్నోసార్లు బహిరంగంగా చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.

 

అధికారంలో సుదీర్ఘకాలం ఉండాలని లేకపోతే బతికినంత కాలం తామే అధికారంలో ఉండాలని పాలకులకు ఉండటం సహజమే. కానీ వాళ్ళ పరిపాలన కూడా దానికి తగ్గట్లే ఉండాలి కదా. మరో  30 ఏళ్ళు అధికారంలో ఉండాలని కలలుగన్న చంద్రబాబు పరిపాలన ఏ విధంగా సాగిందో అందరూ చూసిందే.  ఐదేళ్ళు కూడా చంద్రబాబును జనాలు భరించలేకపోయారంటే ఆయన పాలన ఎంత అధ్వాన్నంగా జరిగిందో మొన్నటి ఎన్నికల ఫలితాలే నిదర్శనం.

 

విచిత్రమేమిటంటే తన పాలన అధ్వాన్నంగా సాగటం వల్లే జనాలు టిడిపిని ఘోరంగా ఓడించారని ఇప్పటికీ అనుకోవటం లేదు. పరిపాలనలో తానే కరెక్టని, తాను బాగానే పరిపాలన చేసినా జనాలే తప్పుగా అర్ధం చేసుకుని వైసిపిని గెలిపించారనే పిచ్చి భ్రమల్లో బతికేస్తున్నారు. సరే ఆయన తాన అంటే తందానా అనటానికి రెడీగా ఉన్న మద్దతుదారులు, పచ్చపత్రికల వల్లే పాపం తొమ్మిది నెలలుగా భ్రమల్లోనే బతికేస్తున్నాడు. ఇపుడు సజ్జల కూడా చంద్రబాబు పాటనే మొదలుపెట్టాడు. మరి జగన్ పరిపాలన ఎలా సాగుతుందో చూడాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: