అమ్మాయిలకు జుట్టే అందం అంటారు.  ఆ జుట్టు కోసం ఎన్నో రకాల షాంపోలు, ఆయుర్వేదిక్ మెడిసన్స్ వాడుతూ తమ కురులను అందంగా తీర్చిదిద్దుకుంటారు. దువ్వుతున్నప్పుడు కొంచెం జుట్టు ఊడినా చాలా బాధపడిపోతుంటారు.  అటువంటిది అమ్మాయిలు తమంతట తాము జుట్టు దానానికి ఒప్పుకోవడమనేది చాలా అరుదు. ఇక భారతీయ మహిళలు జుట్టు గురించి తీసుకునే శ్రద్ద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అలాంటింది 80  మంది విద్యార్థినులు ఏకంగా తమ జుట్టును త్యాగం చేయడానికి సిద్దపడ్డారు.  అయితే వీరు ఆ జుట్టును ఎందుకు దానం చేయడానికి సిద్దపడ్డారో తెలిస్తే నిజంగా ప్రతిఒక్కరూ అమ్మాయిలను అభినందించి తీరుతారు... చేతులెత్తి దండం పెడతారు.  ఇంతకూ వీరంతా తమ జుట్టును ఎందుకు ఇస్తున్నారో తెలుసా? క్యాన్సర్ బారినపడి జుట్టు కోల్పోయిన ఆడవాళ్ల కోసం తమ జుట్టు ఇవ్వాలని వీరంతా ఈ నిర్ణయం తీసుకున్నారు.

 

ఈ జుట్టుతో విగ్స్ తయరుచేసి వారికి ఇవ్వవచ్చనేది వారి ఆలోచన.  దేశంలో చాలా మంది క్యాన్సర్ భారిన పడుతున్నారు. తాజాగా తాము ఎందుకు జుట్టును దానం ఇస్తున్నామో అన్న విషయం గురించి వినోదినీ అనే విద్యార్థిని మాట్లాడుతూ.. క్యాన్సర్ భారిన పడి జుట్టును కోల్పోతున్నారు.. వారికి డబ్బులు ఇచ్చేంత ఆర్థిక స్థోమత మాకు లేదు. కాన్సర్ రోగులను చూసినప్పుడు వారికి జుట్టు లేకపోవడాన్ని నేను గమనించాను. అందుకే మా జుట్టును ఇవ్వాలని నిర్ణయించుకున్నాం '  పేర్కొంది. అయితే జుట్టు ఇచ్చినా తర్వాత పెరుగుతుంది.. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు.

 

కానీ ఆ విగ్గుల వల్ల ఎంతో మంది మనోభలం వస్తుందని ఆమె తెలిపారు.  జుట్టు దానం చేయాలని నాకు వచ్చిన ఆలోచనను మా కాలేజీ స్నేహితులతో పంచుకున్నాను.  ఇప్పటి వరకు 80 మంది తమ పేరును నమోదు చేసుకున్నారు. ఇక్కడికి వచ్చిన విద్యార్థినులు తమ మెరిసే మరియు మందమైన జుట్టులో కొంత భాగాన్ని విరాళంగా ఇచ్చారు. ఆ జుట్టుతో విగ్స్ తయారుచేసి క్యాన్సర్‌ బారినపడ్డ మహిళా పేషంట్లకు పంపిణీ చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: