అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి వినూత్నమైన ఆలోచనలు, రాజకీయ వ్యూహాలతో  తెలుగుదేశంపార్టీని చావుదెబ్బ కొడుతున్నారు. జగన్ వ్యూహాలేంటో అర్ధంకాక చంద్రబాబునాయుడుతో పాటు టిడిపి నేతలు గింజుకుపోతున్నారు. వీళ్ళే ఇలాగైపోతుంటే ఇక వీళ్ళకు మద్దతుగా నిలుస్తున్న పచ్చమీడియా పరిస్ధితి చెప్పనే అక్కర్లేదు. ఇలాంటి నేపధ్యంలోనే స్ధానిక సంస్ధల ఎన్నికల విషయంలో జగన్ మరోకొత్త వ్యూహానికి తెరలేపినట్లు సమాచారం.

 

ఇంతకీ విషయం ఏమిటంటే ఈనెలాఖరులోగా పూర్తియిపోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో 90 శాతం వైసిపినే గెలవాలని మంత్రులు, ఎంఎల్ఏలకు టార్గెట్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇందులో భాగంగానే ముందుగానే వీలైనన్ని స్ధానిక సంస్ధలను ఏకగ్రీవం పేరుతో వైసిపి చేజిక్కించుకోవాలని జగన్ ప్లాన్ చేశాడట. మంత్రులు, ఎంఎల్ఏలు ఇదే విషయమై కసరత్తులు మొదలుపెట్టేశారట. వీలైనన్ని సర్పంచ్, జడ్పిటిసి, ఎంపిటిసి, మున్సిపాలిటిలను ఏకగ్రీవం చేసుకోవాలని జగన్ డిసైడ్ అయ్యారని సమాచారం. ఏకగ్రీవమయ్యే వాటికి ప్రభుత్వం తరపున నిధుల ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు సమాచారం.

 

అంటే ఇదే పద్దతిలో తెలంగాణాలో స్ధానిక సంస్ధలను అధికార టిఆర్ఎస్ కైవసం చేసుకున్న విషయం చూసిందే. ఇదే పద్దతిలో ఎన్నికలకు ముందుగానే వైసిపి కూడా వీలైనన్ని సంస్ధలను ఏకపక్షంగా అందుకోవాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి జగన్ ప్లాన్ ను పక్కన పెట్టినా స్ధానిక సంస్ధల ఎన్నికల్లో గట్టిపోటి కాదు కదా అసలు పోటి చేయటానికి కూడా టిడిపి నేతలు పెద్దగా ఆసక్తిని చూపటం లేదు. 

 

ఇదే విషయమై అనంతపురంలో సీనియర్ నేత, మాజీ ఎంపి జేసి దివాకర్ రెడ్డి స్పష్టంగా ప్రకటించేశారు. తమ మద్దతుదారులెవరూ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటి చేయటానికి ఆసక్తి చూపటం లేదని చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఇంచుమించు ఇదే పద్దతి కర్నూలు జిల్లాలో కూడా కనిపిస్తోందని సమాచారం. వైసిపిని ఢీకొని గెలవటం కష్టమనే అభిప్రాయం సీనియర్ నేతల్లో ఎక్కువమంది వ్యక్తం చేస్తున్నారట. ఇటువంటి పరిస్ధితుల్లో ఏకగ్రీవాలు కూడా తోడైతే జగన్ అనుకుంటున్నట్లు 90 శాతం కాదు ఏకంగా 100 శాతం చేజిక్కించుకున్న ఆశ్చర్యపోవక్కర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: