రాజ్యసభ ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి, బిజెపి ఎక్కడ కలిసిపోతారో అన్న టెన్షన్ పచ్చమీడియాలో రోజురోజుకు పెరిగిపోతోంది. తొందరలో భర్తీ చేయాల్సిన నాలుగు రాజ్యసభ స్ధానాల్లో ఒకటి తన సన్నిహితుడికి కావాలంటూ రిలయన్స్ అధినేత, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ అమారవతికి వచ్చి జగన్ ను కలిసిన విషయం అందరికీ తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా వీళ్ళ భేటి జరిగిన దగ్గర నుండి టిడిపి, పచ్చమీడియాలో టెన్షన్ పెరిగిపోతోంది. ముఖేష్ సన్నిహితుడు నత్వానికి ఓ అవకాశం ఇవ్వమంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా సిఫారసు చేశాడంటూ ప్రచారం జరుగుతోంది.

 

అమిత్ షా సిఫారసు ప్రకారం జగన్ రిలయన్స్ అధినేత సన్నిహితుడికి ఎక్కడ ఓ సీటు కేటాయించేస్తాడో అన్న ఆందోళన పెరిగిపోతోంది పచ్చమీడియాలో. తన ఆందోళనను బయటపెట్టుకుంటు  పచ్చమీడియాలో వచ్చిన  ఓ చెత్త కథనమే నిదర్శనం. ఆ కథనం ప్రకారం బిజెపి అడిగినట్లు ఓ సీటును నత్వానికి ఇవ్వకూడదని జగన్ ను పార్టీ నేతలు కోరుతున్నారట. అసలు రాజ్యసభ స్ధానాలు ఎవరెవరికి కేటాయించాలనే విషయంలో జగన్ పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకుంటాడా ? జగన్ దాకా వద్దు చంద్రబాబునాయుడు ఎప్పుడైనా  తీసుకున్నాడా ?

 

బిజెపికి కానీ లేకపోతే ఆ పార్టీ సూచించిన వ్యక్తులకు లేదా సినీ-పారిశ్రామిక వేత్తలకు కూడా ఇవ్వకూడదని జగన్ తో చెబుతున్నారట నేతలు. కారణం ఏమిటయ్యా అంటే రాష్ట్ర విభజన సమయంలో ఏపిని మోసం చేసిన బిజెపికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే జనాలు జగన్ పై మండిపోతారట. ఎంత విచిత్రమైన లాజిక్ లేని కథనమో ? అసలు రాజ్యసభ సీట్లకు మామూలు జనాలకు  ఎక్కడైనా సంబంధం ఉటుందా ? బిజెపికి అనుకూలంగా జగన్ నిర్ణయం తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో పార్టీ చిత్తుగా ఓడిపోవటం ఖాయమని పార్టీ నేతలు అనుకుంటున్నారట.

 

అంటే ఇక్కడ గమనించాల్సిందేమంటే ముఖేష్ తో కానీ బిజెపితో కానీ జగన్ చేతులు కలపకూడదని చంద్రబాబు, పచ్చమీడియాకే చాలా బలంగా ఉంది. తమ ఆలోచనలకు విరుద్ధంగా జరిగితే తమకు భవిష్యత్తు ఉండదనే టెన్షన్ పెరిగిపోతోంది. ఈ ముక్క రాసుకునే ధైర్యం లేక చెత్తంతా రాసి అచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: