వారేవా ఏం చైనా అండీ.. టెక్నాలజీతో పాటుగా.. వైరస్‌లను కూడా సృష్టిస్తుంది.. చైనా బొమ్మలు, చైనా సెల్‌ఫోన్లు, ఇలా ఇప్పటివరకు చైనాలోని ప్రతి వస్తువు మన జీవితంలో భాగమైపోయింది.. మరి చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ను కూడా జీవితంలో భాగం చేసుకోలేక పోతున్నారు ఎందుకని, అని కొందరు అమాయకులు ప్రశ్నించుకుంటున్నారట.. ఇన్నాళ్లూ చైనా చైనా అని కలవరించే వారికి అదే కరోనా అనే చైన్‌తో గట్టిగా లాగిపెట్టి ఒక్కటిచ్చింది చైనా.. ఇప్పుడు చైనా దెబ్బకు ప్రపంచదేశాలన్ని కుదేలులై పోతున్నాయి..

 

 

మరి చైనా ప్రొడక్ట్ అంటే మాటలా అంత క్వాలీటి ఉంటుంది.. అందుకే కరోనా బిజినెస్ ప్రపంచదేశాలకు వేగంగా వ్యాపించింది.. వ్యాపిస్తుంది.. ఇకపోతే ఎలాంటి డబ్బు ఖర్చు పెట్టకుండా అందరికి ఉచితంగా సరాఫరా చేస్తున్న కరోనా వైరస్ చైనా వారి కలలను సాకారం చేస్తు ప్రతివారికి వీలైనంత త్వరగా అంటుకోవడానికే ప్రయత్నిస్తుందట.. ఇలాంటి దశలో కరోనా వైరస్ సోకడానికి కొన్ని ముఖ్య కారణాలను కనుగొన్నారు శాస్త్రవేత్తలు.. అదేమంటే ఈ వైరస్ వచ్చిన వ్యక్తి మరొక వ్యక్తిని తాకినప్పుడు సోకుతుందట. అది కూడా ముక్కు, కళ్ళ ద్వారా మాత్రమే మరొకరికి వ్యాపించే అవకాశం ఉందట..

 

 

ఇది ఊపిరి తిత్తుల్లోకి ముక్కుద్వారా ప్రవేశిస్తుంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే. వైరస్, బ్యాక్టీరియా మరే పరాన్నజీవి అయినా శరీరంలోకి డైరెక్ట్ గా ప్రవేశించలేదట.. కాబట్టి దానికి ఓ వాహకం కావాలి. ఆ వాహకం దానికి లభించినప్పుడు మాత్రమే ప్రవేశించగలుగుతుంది... ఇక ఇప్పుడు శాస్త్రవేత్తలు కనుగొన్న విషయం ఏంటంటే.. కరోనా వైరస్ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడానికి ఓ ప్రోటీన్ సహాయ పడుతుందట. దాని పేరు. టి.ఎమ్.పీ.ఆర్.ఎస్.ఎస్.2.  ఈ ప్రోటీన్  ద్వారా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది.  

 

 

అలా ప్రవేశించిన వైరస్, శరీరంలోని వివిధ భాగాలకు వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.. ఇకపోతే శరీరంలోకి వైరస్ ప్రవేశించే విధానం కనుగొన్నారు కాబట్టి, ఇప్పుడు దానికి విరుగుడు కనుగొనడం పెద్ద విషయం కాదని, త్వరలోనే మెడిసిన్ కనుగొంటామని జర్మనీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.. ఇదేగనుక త్వరగా జరిగితే ప్రపంచానికి మేలుచేసిన వారవుతారని ఆశపడుతున్నారు కొందరు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: