టాలీవుడ్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ ని శాసించిన మెగాస్టార్ చిరంజీవి 2009వ సంవత్సరంలో ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. అంతకుముందు చిరంజీవి అందరివాడు అంటూ ఎన్నికల ప్రచారంలో తెగ ఊదరగొట్టి చిరంజీవి కొందరి వాడి గా మారిపోయాడు. ఎన్నికలలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేయడం జరిగింది. దీంతో చిరంజీవి పరువు మొత్తం పోయింది. చిరంజీవి రాజకీయాలకు పనికిరాడు అనే ముద్ర గట్టిగా జనాల్లో నాటుకుపోయింది. ప్రస్తుతం సినిమారంగంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి మరొకసారి వైసిపి పార్టీ నుండి రాజ్యసభ సీటు ట్రై చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

 

ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ తో మంచి సాన్నిహిత్య సంబంధం ఉండటంతో చిరంజీవి రాజ్యసభకు ప్లాన్ చేస్తున్నారు అనే వార్తలు సోషల్ మీడియాలో చాలా బలంగా వచ్చాయి. దీంతో చాలా మంది మెగా అభిమానులు అదే నిజం అన్న భావనలో ఉండిపోయారు. ఇటువంటి సందర్భంలో  దాన్ని ఖండించేలా నాగబాబు లేటెస్ట్ గా మీడియా తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. చిరంజీవి జనసేనకు మాత్రమే మద్దతుదారు. అంతకు మించి ఆయన రాజకీయ జీవితం అంటూ వేరే లేదు. ఆయన సినిమాలకే పరిమితం, ఎవరైనా వెధవ తెలివితేటలు చూపించి ఆయన్ని పొలిటికల్ గా క్యాష్ చేసుకోవాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించారు.

 

అయితే ఈ తంగం మొత్తం రాజ్యసభకు వైసీపీ నుండి సరైన గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో అందరివాడు చిరంజీవి ప్లాన్ లు అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత నాగబాబు యూట్యూబ్ లో తన చానల్లో ఈ విధమైన వ్యాఖ్యలు చేశారని కొంతమంది కామెంట్. మరి ఇదే సందర్భంలో నిజంగా చిరంజీవికి జనసేన పార్టీ పై అంత చిత్తశుద్ధి ఉంటే 3 రాజధానుల విషయంలో వచ్చిన వార్తల విషయంలో కూడా నాగబాబు స్పందించాలి కదా అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: