జగన్ నిర్ణయాలు వేరేగా ఉంటాయి. ఎవరూ అసలు ఊహించలేరు కూడా. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్లు కూడా అలాగే ఇచ్చారు. చివరి నిముషం వరకూ చాలా సీక్రెట్ గా  ఉంచారు. దాంతో రాదనుకున్న వారికి టికెట్లు వచ్చాయి. వస్తాయనుకున్న వారికి టికెట్లు పోయాయి. దాంతో జగన్ మనసు చదవడం కష్టమని అంతా అనుకున్నారు. ఇపుడు రాజ్యసభ అభ్యర్ధుల సెలెక్షన్   విషయం తీసుకున్నా అదే తీరుగా ఉందంటున్నారు. 

 

ఏపీలో నాలుగు రాజ్యసభ ఎంపీలు వైసీపీకే వస్తాయి. ఇందులో రెండవ మాటా లేదు. డౌటు అంతకంటే లేదు. ఇవన్నీ ఇలా ఉంటే జగన్ రాజ్యసభకు వెళ్ళే పెద్ద మనుషులును ఎంపిక చేసేశారని ఇన్సైడ్ టాక్. ఆయన మనసులో ఉన్న వారికే ఈ పదవులు దక్కుతున్నాయని  అంటున్నారు.

 

వారిలో ఇద్దరు మంత్రులు ఉన్నట్లుగా చెబుతున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణలకు జగన్ పెద్ద  పీట వేశారు. వారిని ఈసారికి  రాజ్యసభకు పంపుతున్నారు. ఎందుకంటే శాసనమండలి రద్దు వల్ల వారి మంత్రి పదవులు పోతున్నాయి. ఈ నేపధ్యంలో వారికి చాన్స్ ఇచ్చేశారని చెబుతున్నారు.

 

అలాగే తన కోసం, పార్టీ కోసం ఎపుడూ త్యాగాలు చేస్తున్న అయోధ్య రామిరెడ్డికి రాజ్యసభ సీటు కన్ఫర్మ్ చేశారట. ఆయన 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు. ఈసారి టికెట్ కూడా అడగకుండా పనిచేశారు. జగన్ కి విశ్వాసపాత్రుడు కాబట్టి ఆయనకే జై కొట్టారట. చివరికి, నాలుగవది  బీజేపీ వారి కోరిక మేరకు ముఖేష్  అంబానీ సన్నిహితుడు పరిమళ్  నత్వానీకి జగన్ కేటాయించారని చెబుతున్నారు.

 

అంబానీతో దోస్తీతో ఏపీలో భారీగా పెట్టుబడులు వస్తాయని జగన్ భావిస్తున్నారుట. అదే సమయంలో బీజేపీ  చెప్పినవారికి ఇవ్వడం ద్వారా కేంద్రంతో దోస్తీ చేసి ఏపీలో భారీగా నిధులు తెచ్చుకోవచ్చునని జగన్ ప్లాన్ చేశారని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే జగన్ ఎంపిక సూపర్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: