జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పెద్దగా రిలాక్స్ అయిన సందర్భాలు అస్సలు లేవనే చెప్పాలి. ఓ వైపు సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా నిలుస్తూనే, మరోవైపు అభివృద్ధి కోసం అనేక నిర్ణయాలని తీసుకుని అమలు చేయడానికి కష్టపడుతున్నారు. అదేవిధంగా ఆర్ధిక పరిస్థితి బాగోకపోయిన, తన శక్తికి మించి కష్టపడుతూ, ప్రజలకు మేలు చేయడానికి చూస్తున్నారు. ఇక తాజాగా చూసుకుంటే, ఈ మార్చి నెలలో జగన్‌కు బోలెడు కష్టాలు ఎదురవ్వనున్నాయి.

 

ఈ నెలాఖరిలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే రాష్ట్రానికి రావాల్సిన దాదాపు 3 వేల కోట్లపైనే నిధులు ఆగిపోయే అవకాశముంది. కాబట్టి ఈ నెలాఖరి లోపే ఎన్నికలు ముగించేందుకు జగన్ సిద్ధమయ్యారు. ఇదే సమయంలో మార్చి 31లోపు బడ్జెట్ ప్రవేశ పెట్టకపోతే ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రానికి నిధులు ఖర్చు పెట్టలేరు. బడ్జెట్ ప్రవేశ పెట్టాకే నిధులు ఖర్చు పెట్టడానికి కుదురుతుంది. దీంతో కనీసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి ఎలాగోలా ముందుకెళ్లాలని చూస్తున్నారు.  స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయాక మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టే అవకాశముంది.

 

ఇక ఇప్పుడు ఇంటర్ విద్యార్ధులు పరీక్షలు జరుగుతుండగా, తర్వాత టెన్త్ విద్యార్ధులకు పరీక్షలు జరగనున్నాయి. అలాగే మరోవైపు కరోనా వైరస్ అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి. అయితే ఇన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్న జగన్ మాత్రం పేదలకు న్యాయం చేయడం మాత్రం ఆపడం లేదు. ఇప్పటికే ఉగాది నాటికి 25 లక్షల మంది పేదలకు ఉచిత ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి జగన్ సిద్ధమైన విషయమైన తెలిసిందే.

 

ఈ క్రమంలోనే ఇళ్ల స్ధలాలు తీసుకున్న పేదలకు కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీలను మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా పేదలకు ఇవ్వబోతున్న ఇళ్ల స్ధలాలపై రుణాలు పొందేందుకు, వాటిని తాకట్టు పెట్టుకునేందుకు, ఐదేళ్ల తర్వాత నేరుగా అమ్ముకునేందుకు కూడా అవకాశం కల్పించారు. ఏదేమైనా ఎన్ని ఇబ్బందులు ఉన్న పేదవారికి మరింత లబ్ది చేకూరేలా జగన్ నిర్ణయం తీసుకోవడం చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: