ఆంధ్రప్రదేశ్ వైసీపీ పార్టీకి సంబంధించి ఢిల్లీ వ్యవహారాలన్నీ పార్టీ సీనియర్ నాయకుడు విజయ్ సాయి రెడ్డి దగ్గరుండి చూసుకుంటారు. అంతేకాకుండా చాలా కీలకమైన విషయాలలో కూడా విజయ్ సాయి రెడ్డి...జగన్ కి ముందు నుంచి అండగా నిలబడుతూ ఇప్పటిదాకా రాణించారు. ఒక విధంగా చెప్పాలంటే వైసిపి పార్టీ లో జగన్ తర్వాత స్థానం విజయ్ సాయిరెడ్డి ది. ఎన్నికల ప్రచారంలో గానీ మరియు జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర చేస్తున్న సమయంలో గానీ పార్టీకి వెన్నెముకగా బలంగా నిలబడిపోయి జగన్ ముఖ్యమంత్రి అవటానికి కీలక పాత్ర పోషించారు. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు కీలక వ్యవహారం విషయంలో పూర్తి అధికారం విజయసాయిరెడ్డి చేతిలో జగన్ పెట్టినట్లు వైసీపీ పార్టీలో వార్తలు వస్తున్నాయి.

 

ఈ నేపధ్యంలోనే విశాఖలో రాజధాని ఏర్పాటుకి సంబంధించి ఇప్పటికే అన్నీ ప్రభుత్వం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎలా అయినా సరే ఉగాది నుంచి పాలన మొదలుపెట్టాలని పట్టుదలగా ఉన్నారు జగన్. ఈ మేరకు ఇప్పటికే కీలక శాఖల అధికారులకు ఆయన ఆదేశాలు కూడా జారీ చేసినట్టు సమాచారం. విశాఖపట్నంలోని మధురవాడలో మిలీనియం టవర్స్‌కు అత్యంత సమీపంలో ఉన్న కాపులుప్పాడ కొండపై సచివాలయం నిర్మించే దిశగా సర్కారు చర్యలు చేపడుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

 

మిలీనియం టవర్స్‌లో సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలని భావించినా.. కొన్ని అనివార్య కారణాలతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. అయితే ఏది ఏమైనా 3 రాజధానుల విషయంలో మాత్రం జగన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎలాగైనా రాజధానిగా అనుకుంటున్నా మూడు ప్రాంతాలలో రాబోయే రోజులలో ప్రభుత్వానికి సంబంధించి పరిపాలన పనులన్నీ జరిపించే ఆలోచనలో వైయస్ జగన్ ఉన్నారు. ఈ సందర్భంగా వాటికి సంబంధించి పనులన్నింటినీ జగన్ విజయసాయి రెడ్డి చేతిలో పెట్టినట్లు వైసిపి పార్టీ లో వార్తలు బలంగా వినబడుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: