దేశ‌వ్యాప్తంగా రాజ్య‌స‌భ ఎన్నిక‌ల హ‌డావిడి ప్రారంభ‌మైంది. ఈ క్ర‌మంలోనే తెలంగాణలో సైతం రాజ్య‌స‌భ ఎన్నిక‌ల హ‌డావిడి ప్రారంభ‌మైంది. అధికార టీఆర్ఎస్‌లో రాజ్యసభ రేసు జోరందుకుంది. తెలంగాణకు దక్కబోయే రెండు స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోనే పడనుండటంతో... ఈ రెండు సీట్ల కోసం పార్టీలో తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది. కేసీఆర్ మ‌దిలో ఈ రెండు సీట్ల విష‌యంలో ఎవ‌రు ?  ఉన్నారు ?  ఎవ‌రిని ఎంపిక  చేస్తార‌న్న‌ది మాత్రం అంతు చిక్క‌డం లేదు. ఇదిలా ఉంటే మాజీ హోం మంత్రి, పార్టీ సీనియ‌ర్ నేత నాయిని న‌ర్సింహారెడ్డి తాజాగా కేసీఆర్‌ను క‌లిసి ఒక రాజ్య‌స‌భ సీటు త‌న‌కు ఇవ్వాల‌ని కోరిన‌ట్టు తెలుస్తోంది.



ఇప్ప‌టికే గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ముషీరాబాద్ సీటు త‌న‌కు లేదా త‌న అల్లుడు శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వాల‌ని నాయిని కోరారు. అప్ప‌ట్లో కేసీఆర్ నాయిని కుటుంబాన్ని ప‌క్క‌న పెట్టి ముఠా గోపాల్‌కు సీటు ఇచ్చారు. ఆ ఎన్నిక‌ల్లో ముఠా గోపాల్ విజ‌యం సాధించ‌గా నియోజ‌క‌వ‌ర్గంలో నాయిన ప‌ట్టు పోయింది. అప్ప‌టి నుంచి నాయిని త‌న‌కు గాని లేదా త‌న అల్లుడికి గాని ఏదో ఒక ప‌ద‌వి ఇవ్వాల‌ని కోరుతున్నా కేసీఆర్ ప‌ట్టించుకో లేదు. దీనికి ఓ కార‌ణం కూడా ఉంది. టిక్కెట్ రాలేద‌ని కోపంతో నాయిని కేసీఆర్‌పై ఓపెన్‌గానే అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.



త్వరలోనే ఎమ్మెల్సీగా నాయిని పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో... ఆయనకు మరోసారి ఎమ్మెల్సీ పదవి దక్కుతుందా లేదా అన్న దానిపై టీఆర్ఎస్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇక ఈ క్ర‌మంలోనే మ‌ళ్లీ నాయినికి ఎమ్మెల్సీ అవ్వ‌డం ఇష్టం లేదు. ఈ క్ర‌మంలోనే ఈ సారి రాజ్య‌స‌భ కావాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. పార్టీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం నాయిని కేసీఆర్‌కు ప‌రోక్షంగా అల్టిమేటం కూడా జారీ చేస్తున్నార‌ని టాక్‌.. ? ఈ సారి ఎలాగైనా తాడోపేడో తేల్చుకోవాల‌ని ఆయ‌న ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌ట‌. మ‌రి కేసీఆర్ నాయినికి ఎలా న్యాయం చేస్తారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: