ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి రోజు రోజు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోతోంది. ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి దేశంలో తల పండిపోయిన రాజకీయ నేతలకు మతిపోగొడుతున్నడు వైయస్ జగన్ అంటూ చాలామంది ఏపీ ప్రభుత్వ పరిపాలన పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతా బాగానే ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని మీడియా చానళ్లు మరియు కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్న తీరు వల్ల జగన్ పరిపాలన పై సరైన స్పందన కనబడటం లేదు. ఇటువంటి తరుణంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి చేత జై జగన్ అని అనిపించుకునేలా వ్యవహరించారు. విషయంలోకి వెళితే ఇటీవల వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు కంపల్సరీ అని ప్రకటన చేయడం జరిగింది.

 

దీంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు మిగతా రాజకీయ నాయకులు అదేవిధంగా అమరావతి ప్రాంతంలో రాజధాని రైతులు జగన్ తీసుకున్న నిర్ణయంపై మంచు పడటం జరిగింది. అంతేకాకుండా కేంద్ర స్థాయిలో ఈ విషయాన్ని కడిగిపారేసి జగన్ పరువు తీయాలని ప్లాన్ చేస్తున్న సమయంలో బీజేపీకి ప్రాణం లాంటి ఉత్తరభారతంలోని ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావత్ జగన్ మూడు రాజధానులకు జై అంటున్నారు. తిప్పి తిప్పి కొడితే గట్టిగా డెబ్బై అసెంబ్లీ సీట్లు కూడా లేని అతి చిన్న ఉత్తరాఖండ్ మూడు రాజధానులు అనడం అంటే 175 అసెంబ్లీ సీట్లు కలిగిన ఏపీకి మూడు బాగానే కుదిరినట్లేనని భావించాలి.

 

మొత్తం మీద ఈ పరిణామం బట్టి బీజేపీ చేత జగన్...'జై జగన్' అనిపించుకున్నట్లే అని అంటున్నారు చాలామంది. ఇదే తరుణంలో బిజెపి కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప కూడా  అధికార వికేంద్రీకరణను చేపట్టారు. దానికి సంబంధించి బిల్లుని కూడా అసెంబ్లీలో ఆమోదించుకున్నారు. ఉత్తర కర్ణాటకలో ప్రభుత్వ ఆఫీసులను పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. మొత్తంమీద చూసుకుంటే బీజేపీ పార్టీ మొత్తం జగన్ ని ఫాలో అవుతున్నట్లు అర్థమవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: