ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళనలో  ఉన్నట్టుగా ఆ పార్టీ నాయకుల వ్యవహారం బట్టి కనిపించింది. కోర్టులో పిటిషన్లు వేయడం, రిజర్వేషన్స్ పై రాద్దాంతం చేస్తూ, హడావిడి చేస్తూ ఎన్నికలను వాయిదా వేయించేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైసీపీ మినహా మిగతా పార్టీల అభ్యర్థులు కాస్త వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే.. అది రుజువైతే అనర్హత వేటు పడేలా చట్టాన్ని తీసుకురావడంతో ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.

IHG


 ప్రభుత్వం ఏదోరకంగా ఇరికించి జైలుకు పంపిస్తుందని భయం పోటీ చేయాలనుకున్న వైసీపీ వ్యతిరేక పార్టీల అభ్యర్థులకు కలుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచితే, అది రుజువు అయితే, ఆ అభ్యర్థి గెలిచినా జైలుకు వెళ్లడం ఖాయం. ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన చట్టంలో ఈ విధంగా నిబంధనలు రూపొందించింది.  ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయడం కత్తిమీద సామే అని అభ్యర్థులు భావిస్తున్నారు. పైగా అన్ని మద్యం షాపులు ప్రభుత్వ అజమాయిషీలో నడుస్తుండడంతో మందు పంపకం చాలా కష్టం అవుతుందని వీరంతా భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే అనర్హత వేటుతో పాటు గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. అలాగే గ్రామంలో ఉండేవాళ్లే సర్పంచ్ గా పోటీ చేయాలని ఆర్డినెన్స్ కూడా సూచిస్తోంది. 


100% గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో గిరిజనులకే పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు. ఇలా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నో కఠినమైన నిబంధనలు రూపొందించడంతో ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు తర్జనభర్జన పడుతున్నారు. ఎలాగూ ఏపీలో అధికార పార్టీ గా వైసిపి ఉండటంతో ప్రజలు కూడా ఆ పార్టీ వైపే మొగ్గు చూపుతారని, తాము ఎన్నికల్లో పోటీ చేసినా చేతులు కాల్చుకొక తప్పదు అనే ఆలోచనలో ఇప్పటి వరకు ఉన్నా, కొత్తగా తీసుకొచ్చి కఠిన నిబంధనలు ప్రకారం ఖచ్చితంగా తాము ఇరుక్కునే అవకాశం ఉంటుందని పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్న వారంతా ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: