ప్రస్తుత పరిస్దితుల్లో ప్రపంచంలోని ఏ వ్యక్తిని కదిలించిన అతని నుండి వచ్చే మాట ఒక్కటే.. అదే కరోనా.. నిద్దర్లో కూడా కరోనా అని కలవరించే స్దాయిలో దీని ప్రతాపాన్ని చూపిస్తుంది... ముచ్చటగా చైనా నుండి సముద్రాలు దాటుకుంటూ, ప్రపంచం అంతా చుట్టేస్తుంది.. అందులో భాగంగా మన భారతదేశాన్ని కూడా సందర్శించడానికి ఇక్కడ కాలుమోపింది. ఇక ప్రస్తుతానికైతే ప్రపంచ దేశాలతో పోలిస్తే, అదృష్టవశాత్తూ కరోనా ప్రభావం ఇండియాలో తక్కువగానే ఉంది. అలాగని, ఈ వైరస్‌ను నమ్మలేం.. కరోనా ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ, ఎలాగైనా, ఎక్కడైనాసరే.. కరోనా కాటేసే ప్రమాదం ఉంది. మనమింకా కరోనా డేంజర్ జోన్ లోనే ఉన్నామని మరిచిపోవద్దు....

 

 

ఇక కరోనా వేడిగా ఉన్న ప్రదేశంలో ఎక్కువ సమయం బ్రతికే చాన్స్ లేదనే ధీమాలో మాత్రం ఉండకండి.. ఇప్పటికే వైద్య నిపుణులు ఈ వైరస్ ఎక్కడ ఎంత సమయం బ్రతుకుందో తెలిపారు కానీ ఒక్క చోట మాత్రం 72 గంటలు ఖచ్చితంగా ఉంటుందనే విషయాన్ని ఆలస్యంగా చెబుతున్నారు.. ఆ ప్రదేశం ఎక్కడంటే నిత్యం మనందరం వాడే హ్యాండ్ రెయిల్స్ పైన అని తెలుపుతున్నారు.. అవునండి ఇది నిజమట. గట్టి ఉపరితలాలైన హ్యాండ్ రెయిల్స్ పై 72 గంటలు అంటే, మూడు రోజుల పాటు కరోనా వైరస్ బతికే ఉంటుందని చెప్పారు.

 

 

ఇలాంటివి బస్సుల్లోనూ, రైళ్లలోనూ ఉంటాయి. వీటిని కరోనా వైరస్ ఉన్న వ్యక్తి తాకితే, వాటినే అందులోకి ఎక్కిన ప్రతి ప్యాసెంజర్ పట్టుకుంటే ఈ వ్యాధి సోకే అవకాశాలున్నాయట.. అందుకే పదేపదే జర్నీ చేసేవారు ప్రయాణ సమయాల్లో ముఖ్యంగా హ్యాండ్ రెయిల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు తెలుపుతున్నారు.. అయితే కొన్ని సందర్భాల్లో హ్యాండ్ రెయిల్స్ పైన ఉండే కరోనా వైరస్ కేవలం 48 గంటల్లోనే చనిపోయే అవకాశం ఉందని కాని ఎక్కువ సమయం కూడా జీవించ వచ్చని పేర్కొంటున్నారు..

 

 

ఇక కొందరికి మాత్రం హ్యాండ్ రెయిల్స్ తాకగానే కరోనా వైరస్ సోకుతుందా అనే డౌట్ రావచ్చు, కానీ ఆ డౌట్‌కు క్లారీటిగా చెప్పే సమాధానం ఏంటంటే హ్యాండ్ రెయిల్స్ ముట్టుకున్న చేతులతోనే ముఖంపై లేదా ముక్కు, కళ్లు, నోరుపై ముట్టుకోవడం చేసినప్పుడు మాత్రమే కరోనా వైరస్ మీ శరీరంలోకి ప్రవేశిస్తుందని తెలుసుకోవాలి.. కాబట్టి ప్రజల్లారా ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరచుకుంటు, వీలైనంత వరకు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికే ప్రయత్నించండి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: