అవును ఆడవారే ఎక్కువ నవ్వుతారట. ఇది అక్షరాలా నిజం. ఒక సేయింగ్ వుంది.. 'నవ్వు మంచి ఔషధం'అని. దీన్ని ఏనాడో ఆరోగ్య నిపుణులు చెప్పారు.. ఈనాడు కూడా చెప్తున్నారు. అలాగే నేడు ప్రతి పట్టణాల్లోనూ మనం లాఫింగ్ క్లబ్ లను చూడవచ్చను. ఒకప్పటిలా కాకుండా ఇపుడు ప్రజలకు ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఎక్కువైందనే చెప్పుకోవాలి. ఇక మనసారా నవ్వడం అన్ని విధాలా ఆరోగ్యదాయకం కూడాను.

 

IHG

 

అలాగే గుండె ఆరోగ్యవంతంగా పనిచేయాలంటే మనసారా నవ్వుతూ ఉండమని హార్ట్ కు సంబంధించిన నిపుణులు చెబుతూ ఉండటం మనం గమనించవచ్చు. వ్యాయామం చేయాలని మనసులో తలచినా కూడా  రోజూ ఉదయాన్నే లేచి వాకింగ్‌కో, జాగింగ్‌కో వెళ్లాలంటే ఒక వైపు నిద్ర, బద్ధకం రెండు ఒకేసారి మనల్ని కమ్మేస్తాయి. అయితే ఈ సాధక బాధలు పడలేవారు హాయిగా ఒక కామెడీ చూసి హాట్టహాసంగా నవ్వేయండి.. చాలు.. అదే మీకు జాగింగ్ తో సమానం అని చెప్తున్నారు.

 

అవును.. పొద్దున్నే లేచి వాకింగ్, జాగింగ్, రన్నింగ్ వంటి వ్యాయామాల వల్ల ఎంతటి లాభం కలుగుతుందో  మనసారా నవ్వడం వల్ల కూడా అంతే అని ఇటీవలి అధ్యయనాల్లో తేట తెల్లమైంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి వుంది. డాక్టరు విల్సన్ గారు, ఒక ఆంగ్ల భాషా పత్రిక అయిన ‘‘రివిస్తా క్లినికా ఎస్సనోల’’లో ప్రస్తావిస్తూ.. మగవారికంటే స్త్రీలే ఎక్కువగా నవ్వుతారు అని తేల్చి చెప్పడం గమనార్హం. ఎందుకంటే వారిలో ఎండార్ఫిన్లు మనకంటే ఎక్కువగా రియాక్ట్ అవుతాయట.

 

IHG

 

గమనించండి.. నవ్వినప్పుడు మనం బాధలను మర్చిపోతాం. నవ్వుల వలన మెదడులో ‘ఎండార్ఫిన్లు’ విడుదలయి, సాధక బాధలను తగ్గిస్తాయి. ‘ఎండార్ఫిన్లు’ అంటే సహజంగా నొప్పిని తీసివేసే మందులు అని అందరికి తెలిసినదే కదా. అవి శరీరంలోనే ఉత్పత్తి అయ్యి, మానసిక వొత్తిడిని తొలగించి శరీర శక్తిని ఇనుమడింప చేస్తాయి. అందుకే మిత్రులారా ఆడవారే కాదు మగవాళ్ళు కూడా ఎక్కువ నవ్వగలరు అని నిరూపించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: