2017 లో పాడి రైతు పెహ్లూ ఖాన్‌ను హతమార్చిన జనసమూహంలో హస్తమున్న ఇద్దరు యువకులను అల్వార్ జువెనైల్ జస్టిస్ బోర్డు దోషిలుగా తేల్చినట్లు డిఫెన్స్ న్యాయవాది ఆదర్శ్ యాదవ్ శుక్రవారం తెలిపారు. పెహ్లు ఖాన్ అనే పాడి రైతు 2017 లో పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నాడని భావించిన కొంతమంది అతడిని కనికరం లేకుండా కొట్టారు.



హర్యానా యొక్క నుహ్ జిల్లాకు చెందిన 55 ఏళ్ల పెహ్లు ఖాన్ పై దాడికి ఒడిగట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురిని గత ఏడాది ఆగస్టులో నిర్దోషులుగా న్యాయస్థానం ప్రకటించింది. ఐతే ఈ తీర్పుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం రాజస్థాన్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది.



దీంతో విపిన్ యాదవ్, రవీంద్ర యాదవ్, కలు రామ్ యాదవ్, దయానంద్ యాదవ్, యోగేశ్ ఖాతి, భీమ్ రతిలను హత్య, అల్లర్లు, బాధ కలిగించడం, ఆస్తి నష్టం, దొంగతనం ఆరోపణలపై విచారించిన తరువాత అనుమానం వచ్చింది.




ఇకపోతే దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించిన ఈ కేసులో మొదటిసారిగా దోషులుగా తేలిన ఇద్దరు మైనర్లకు శనివారం శిక్ష విధించబడుతుంది. కానీ దేశ బాల్య చట్టం ప్రకారం గరిష్టంగా మూడేళ్ల వరకు మాత్రమే వారిని జైలులో ఉంచవచ్చు.




జైపూర్‌లోని వారపు మార్కెట్ నుండి కొన్న పశువులను తన ఇద్దరు కుమారులు కలిసి నుహ్‌లోని తన ఇంటికి రవాణా చేస్తున్నప్పుడు ఆవులను అక్రమంగా రవాణా చేస్తున్నారనే అనుమానంతో పాడి రైతు ఖాన్ పై అల్వార్ జిల్లాలోని బెహ్రోర్ సమీపంలో ఢిల్లీ-జైపూర్ హైవేపై దాడి చేయగా అతను ఏప్రిల్ 3, 2017 న ఆసుపత్రిలో మరణించాడు.

 



ఆరుగురిని కింది కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన తరువాత, తీర్పుకు దారితీసిన అంశాలపై దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. కొత్త సాక్ష్యాలను సేకరించాలని మునుపటి దర్యాప్తు అధికారులచే గుర్తించబడిన నిందితులను దర్యాప్తు చేయాలని బృందం సిఫారసు చేసింది. జువెనైల్ కోర్టులో ప్రాసిక్యూషన్ అటువంటి కొత్త సాక్ష్యాలను పరిశీలించిన కారణం గానే ఇద్దరు బాలల శిక్షకు దారితీసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: