ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల సందడి కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెలాఖరు కల్లా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ఎన్నికలు ఆపాలంటూ టీడీపీ కొన్ని ప్రయత్నాలు చేసింది. సుప్రీంకోర్టులో దావా వేయించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 69 శాతానికి పెంచుతూ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది.

 

 

ఎలాంటి రిజర్వేషన్లయినా సరే 50 శాతానికి మించ కూడదని ఓ రూల్ ఉంది. ఇప్పటికి ఇప్పుడు స్థానిక సంస్థల పోరును ఎదుర్కొనేందుకు ఎందుకనో ప్రతిపక్షం టీపీపీ సిద్ధంగా లేదు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు ఆపాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నాడని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎన్నికలు జరపాలని చూస్తుంటే స్టేల కోసం టీడీపీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు.

 

 

చంద్రబాబు ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఆపాలని కుట్ర చేస్తున్నాడని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడలో తెలిపారు. ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబుకు బీసీలు గుర్తొచ్చారని, అధికారంలో ఉండగా బీసీలకు టీడీపీ చేసిందేమీ లేదని ఆయన అన్నారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ కనుచూపు మేరలో కూడా కనిపించదన్నారు.

 

 

 

అధికారం కోల్పోయారని చంద్రబాబు, లోకేశ్ .. తండ్రీకొడుకు ఇద్దరూ కడుపుమంటతో విమర్శిస్తున్నారన్నారు. 90 శాతం ఎన్నికల హామీని సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేశారని, సంక్షేమ పథకాలు డోర్‌ డెలివరీ చేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దే అన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనపై టీడీపీ నేతలు చర్చకు సిద్ధమా..? అని చంద్రబాబుకు వైసీపీ నేతలు సవాల్‌ విసిరారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: