తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిత్యం ఏదో ఒక టెన్షన్ కలవరపెట్టిస్తూనే ఉంది. ఒక దాని తరువాత మరో సమస్య తలెత్తుతూ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పార్టీ భవిష్యత్తుపై ఆందోళనలో ఉండడమే కాకుండా, తన రాజకీయ వారసుడు భవిష్యత్తు పైన చంద్రబాబు చాలా టెన్షన్ లో ఉన్నారు. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కు రెండోసారి ఐటీ నోటీసులు జారీ చేయడం, తప్పనిసరిగా తమ ముందు హాజరు కావాల్సిందేనని ఆ నోటీసుల్లో పేర్కొనడంతో చంద్రబాబు లో టెన్షన్ పెరిగిపోతుంది. ఎందుకంటే అహ్మద్ పటేల్ కు చంద్రబాబుకు మధ్య నడిచిన లావాదేవీలు, ఈ వ్యవహారానికి సంబంధించి చంద్రబాబు పి ఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సోదాలు జరగడం, తగిన ఆధారాలు లభించడం, వాటి ఆధారంగా కాంగ్రెస్ పార్టీ కోశాధికారి అహ్మద్ పటేల్ కు ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడం జరిగాయి.

IHG

ఆరోగ్య సమస్యలు తలెత్తాయని మొదటి ఐటీ నోటీసులకు అహ్మద్ పటేల్ సమాధానం చెప్పడం జరిగాయి. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు బిజెపి కేంద్రంలో అధికారంలోకి రాకుండా చేసేందుకు కాంగ్రెస్ తో కలిసి చంద్రబాబు కుమ్మక్కు అయినట్లుగా అప్పట్లోనే వార్తలు వినిపించాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ తో పాటు మరో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు కోట్లాది రూపాయల ధనాన్ని కాంగ్రెస్ పార్టీ కోసం అహ్మద్ పటేల్ కు అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు అందజేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల్లో డబ్బులు చేతులు మారడం పై ఐటి శాఖ గుర్తించింది. ముంబైకి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నుంచి ప్రముఖ వ్యక్తి లంచంగా 150 కోట్లు తీసుకున్నాడని ఐటీ శాఖ కీలక ఆధారాలు సంపాదించింది.

IHG

అలాగే అమరావతి నిర్మాణం కోసం ఆ కంపెనీ కాంట్రాక్టు ఇచ్చిన వ్యక్తి 150 కోట్లు లంచం తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. 150 కోట్ల రూపాయలు తీసుకున్న ఆంధ్రుడు అంటూ గత ఏడాది నవంబర్ 11వ తేదీన ఢిల్లీలో కేంద్ర ఐటీ శాఖ ప్రకటన విడుదల చేయడంతో ఆ ప్రముఖుడు చంద్రబాబు అని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగింది. ఇప్పుడు ఆ కేసులో అహ్మద్ పటేల్ అడ్డంగా దొరికి పోవడంతో ఆ తరువాత ఐటీ నోటీసులు అందుకునే వ్యక్తి చంద్రబాబు అని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీని కారణంగానే చంద్రబాబు తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: